»   » శ్రీదేవి ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్న అసిన్

శ్రీదేవి ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్న అసిన్

Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు అసిన్ నిర్మాతల హీరోయిన్. నిర్మాతల డబ్బును అనవసరంగా ఖర్చు చేయించడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అసిన్ వేరు. ఎప్పుడైతే ఆమె దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్ళి అమీర్ ఖాన్ సరసన గజినిలో నటించిందో అప్పటి నుంచి ఆమె విలాసవంతమైన జీవితాన్ని అలవరుచుకుంది. ఆ తర్వాత ఆమె లండన్ డ్రీమ్స్ లో నటించినా అది విజయవంతం కాలేదు.

ఆమె బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే ఆమెకు సీనియర్ల సలహాలు అవసరమైని అసిన్ తండ్రి జోసెఫ్ భావించారు. అదృష్టవశాత్తు ముంబయ్ లో అసిన్ ఒకనాటి మేటి తెలుగు నటి శ్రీదేవి, బోనీకపూర్ ల ఫ్లాట్ పక్కన ఉంటోంది. ఇప్పుడు శ్రీదేవి కుటుంబంతో ఆమె చాలా సన్నిహితమైపోయింది. శ్రీదేవి పిల్లలు జాహ్నవి, ఖుషి అసిన్ కు మంచి స్నేహితులయ్యారు. తనకు ఏ అవకాశం వచ్చినా అసిన శ్రీదేవితో, బోనీకపూర్ తో క్షుణ్ణంగా చర్చించి వాళ్ళు ఇచ్చిన సలహాలను పాటిస్తోందట.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu