»   » అశ్వినీదత్-చరణ్ కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి...!

అశ్వినీదత్-చరణ్ కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శక్తి" సినిమాతో దారుణంగా దెబ్బతిన్న నిర్మాత అశ్వనీదత్, 'జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమా సీక్వెల్ కి రెడీ అవుతున్నారు. కెరీర్ లో హిట్టూ ఫట్టూ సహజమేనంటూ మరోమారు భారీ సినిమాకి రెడీ అవుతోన్న అశ్వనీదత్, చరణ్ హీరోగా తెరకెక్కించనున్న'జగదేక వీరుడు అతిలోక సుందరి" సీక్వెల్ కోసం నటీనటుల ఎంపికలో బజీగా ఉన్నారట. కాగా, ఈ సినిమాని వైజయంతీ మూవీస్ తోపాటు, నాగబాబుకి చెందిన అంజనా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

'శక్తి" సినిమా హిట్టయి వుండుంటే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి" సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లి వుండేదే. తన నమ్మకమ్మీద మెహర్ రమేష్ కొట్టిన దెబ్బతో కంగారు పడ్డ అశ్వనీదత్, 'జగదేకవీరుడు అతిలోక సుందరి" సినిమాని ఎవరి చేతిలో పెట్టాలో అర్థం కాక సతమతమవుతున్నాడు. ఇదిలా వుంటే, కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో, ఆయన తనయుడు ప్రకాష్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి" సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరగుతోంది టాలీవుడ్ సర్కిల్స్ లో. ఈ వార్తల్లో నిజానిజాలెంతో గానీ, చాన్నాళ్ళుగా దత్తుగారు కలలు కంటోన్న 'జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాకి నాగబాబే కో ప్రొడ్యూసర్ అయితే పండగేనని మెగాభిమానులు అనుకుంటున్నారు.

English summary
Now, Chiranjeevi has called upon Raghavendra Rao and asked to prepare a similar fantasy script for his son Ramcharan.
 Prakash and Charan are childhood friends and now prakash and his father are working towards such a script.
 Also producer Aswini Dutt had a plan to make sequel of jagadeka veerudu atiloka sundari with Charan in lead. So, if this script works out according to the likes of chiru and charan, we’ll get to see jagadeka veerudu atiloka sundari‘s sequel soon on screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu