»   »  ఓంకార్ ఇంకో 'గది'

ఓంకార్ ఇంకో 'గది'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా పెద్ద సినిమాలు హిట్టైతే, ఆ క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్స్ తీస్తూంటాయి. అయితే ఇప్పుడు ఓ చిన్న చిత్రం ఊహించనివిధంగా హిట్టై సీక్వెల్ కు సిద్దమవుతోంది. ఆ సినిమా మరేదో కాదు....చిన్న సినిమాగా రూపొంది, పెద్ద హిట్ సొంతం చేసుకున్న చిత్రం 'రాజుగారి గది'. టి.వి. యాంకర్ ఓంకార్ డైరక్టర్ గా మారి, తన తమ్ముడుని హీరోని చేసిన ఈ సినిమాకు పార్ట్ - 2 తీయలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సుమారు 10 కోట్ల షేర్ సాదించుకున్న ఈ సినిమా పెద్ద సినిమాల స్థాయిలో నిలబడింది.

ప్రస్తుతం ఈ సినిమాపై ఓంకార్ వర్క్ చేస్తున్నాడని, మెదటి భాగం లో ఎవరైతే పని చేసారో వారితోనే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. 2016లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడి చేస్తారు. ఈ సారి ఈ చిత్రానికి నిర్మాతలుగా కొర్రపాటి సాయి వ్యవహించే అవకాసం ఉంది.


Aswin's Rajugari Gadhi - 2 will start

మరో ప్రక్క...


ఓ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ కథే వేరు. ఆ దర్శకుడుకీ, టీమ్ కు వరస ఆఫర్స్ వస్తూంటాయి. ఇప్పుడు అలాంటిదే దర్శకుడు ఓంకార్ కు జరగబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ‘జీనియస్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది' అంటూ హర్రర్ కామెడీతో మనముందుకు వచ్చారు.


అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ సినిమా విడుదల అయిన ఈ చిత్రం నిన్న రిలీజైన మూడు చిత్రాల్లో బెస్ట్ అనిపించుకుంది. దాంతో ఇప్పుడు ఆయనకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చిందని సమాచారం. ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అనీల్ సుంకర..ఈ దర్శకుడుని తన ఎకె ఎంటర్ట్నైమెంట్స్ బ్యానర్ లో మీడియం బడ్జెట్ లో ఓ చిత్రం చేయమని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

English summary
TV Anchor turned film director Omkar is currently working on the script of the sequel to ‘Raju Gari Gadhi’. The cast and crew of the original project are mostly likely to be continued for the sequel project as well.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu