»   » స్టార్ నిర్మాత బ్యానర్ లో నాగబాబు కొడుకు

స్టార్ నిర్మాత బ్యానర్ లో నాగబాబు కొడుకు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులు రంగప్రవేశం చేయటం కొత్తేం కాదు.బాలయ్య, నాగార్జున, వెంకటేష్, ఆ తర్వాత తరుణ్, ఎన్.టి.ఆర్.నరేష్, ఆర్యన్ రాజేష్, రాం చరణ్ తేజ,అల్లు అర్జున్, నాగచైతన్య,రాణా ఇలా వారసులు అనేకమంది హీరోలుగా సినీరంగప్రవేశం చేశారు...చేస్తున్నారు.వారి జాబితాలో ప్రముఖ నిర్మాత,నటుడు అయిన నాగబాబు కుమారుడు వరుణ్ కూడా హీరోగా సినిమాల్లోకి రానున్నారు. ఈ మేరకు తెర వెనక ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  ఇక వరుణ్ తేజని అశ్వనీదత్ లాంచ్ చేస్తాడని వినపడుతోంది. అశ్వనీదత్ ది గోల్డెన్ హ్యాండ్ అని,ఆయన బ్యానర్ ద్వారా లాంచ్ అయితే కెరిర్ లో సెటిల్ అవ్వచ్చనే ఓ స్ట్రాటజీతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అశ్వనీద్ తన బ్యానర్ ద్వారా మహేష్ బాబు, రామ్ చరణ్ తేజలను పరిచయం చేసారు. మహేష్ తో రాజకుమారుడు, రామ్ చరణ్ తో చిరతగా ఆ చిత్రాలు భాక్సాఫీస్ లను పలకరించాయి. సినిమా రిజల్ట్ లు యావరేజ్ గా ఉన్నా వారు మాత్రం స్టార్స్ గా సెటిల్ అయ్యిపోయారు.

  మరో ప్రక్క పవన్ కళ్యాణ్ కూడా వరుణ్ తేజ భాధ్యతను భుజాన వేసుకున్నట్లు చెప్తున్నారు. నాగబాబు తన తనయుడు వరుణ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు సరైన కథలు చిక్కడం లేదు. దీంతో వరుణ్‌ తేజ్‌ కోసం మంచి కథను వెతికే బాధ్యతను తీసుకున్నారు పవన్‌. ఆయనకు ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా, వరుణ్‌తేజ్‌కి తగిన కథలు వింటున్నారనీ, దర్శకుల ద్వారా వరుణ్‌తేజ్‌ని తెరకి పరిచయం చేయాలనే విషయమై కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.

  వాస్తవానికి 2009లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్‌తేజ్‌ హీరోగా ఎంటర్‌ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కార ణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్‌ తేజకు ఓకే కాలేదు. తర్వాత 2009, 2010లో ఇందు కు సంబం ధించిన ప్రయ త్నాలు జరి గినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీ యాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇషఉ్యతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దుకోవడంతో మళ్లీ వరుణ్‌తేజ్‌ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.

  మరో వైపు ఈ సినిమాను స్టార్ డైరెక్టర్లతో చేయించాలని నాగబాబు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులను సంప్రదించినట్లు తెలుస్తూంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2013 ప్రధమార్థంలో సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలన్నాయి.

  English summary
  
 Aswini Dutt production ‘Vyjayanthi movie’ has become a launching pad for young heroes from star families. One more hero from Megastar’s family is all set to debut in Tollywood soon. Mega Brother Nagababu’s son Varun Tej will be introduced to Tollywood by mega producer Aswini Dutt under his banner ‘Vyjayanthi Movies’ Nagababu is looking for good subject to launch his son.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more