»   » థాంక్స్ చెప్పేందుకు పవన్ కళ్యాణ్ మీటింగ్

థాంక్స్ చెప్పేందుకు పవన్ కళ్యాణ్ మీటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్లకు, మీడియా సమావేశాలకు ఆమడ దూరంలో ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఈ సారి అందుకు భిన్నంగా 'అత్తారింటికి దారేది' చిత్రం సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ పాల్గొన బోతున్నారని వినికిడి. ఈ ఆదివారం హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో ఈ సక్సెస్ మీట్ గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Attarintiki Daredi Success Meet

క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన ఈచిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైన సంగతి తెలిసిందే. అయినా సరే ప్రేక్షకులు సినిమాను భారీగా విజయవంతం చేసారు. ఈ నేపథ్యంలో ప్రేక్షక దేవుళ్లకు, అభిమానులకు థాంక్స్ చెప్పేందుకు భారీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Film Nagar source said that, The makers of Attarintiki Daredi are planning to hold a big success meet this Sunday in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X