»   » నాగచైతన్య 'ఆటోనగర్ సూర్య' టైటిల్ ఛేంజ్

నాగచైతన్య 'ఆటోనగర్ సూర్య' టైటిల్ ఛేంజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, దేవకట్టా కాంబినేషన్ లో 'ఆటోనగర్ సూర్య' అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం టైటిల్ ని 'ఆటోనగర్ శివ' గా మార్చినట్లు విశ్వసనీయ సమాచారం. నాగచైతన్య తండ్రి నాగార్జున నటించిన శివ చిత్రం సాధించిన సంచలన విజయం దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్ ని మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య విజయవాడ ఆటో నగర్ ఏరియాకు చెందిన రౌడీగా కనపించనున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర అయాన్ రాండ్ పాపులర్ నవల..ది పౌంటెన్ హెడ్ లోని హోవర్డ్ రోర్క్ పాత్రను పోలి ఉంటుందని దేవకట్టా చెప్తున్నారు. ఆయన ఈ విషయమై ట్వీట్ చేస్తూ...ఆటోనగర్ సూర్య పాత్ర హోవర్డ్ రోర్క్ పాత్రకు స్క్రీన్ పై యాక్షన్ వెర్షన్. ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఎంత పాజిబులో..హోవర్డ్ రోర్క్ అనే పాత్ర భూమిపై అంతే సహజం. మనందరిలోనూ ఆ పాత్ర ఉంది అన్నారు. ఇక ఆ పాత్ర చాలా ఐడియలిస్ట్ గా ఉంటూ తాను నమ్మిన విలువలకు దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఏం జరిగినా ఫరవాలేదు అన్న కోణంలో ముందుకెళ్తూంటాడు. ఇక ఈ చిత్రం బెజవాడ నేఫధ్యంలో జరిగుతుందని ఓ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారని వినికిడి. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

English summary
Recently it was heard that the talented director Deva Katta has named his project as Autonagar Surya. Now, it is heard that he is looking at changing the title to Autonagar Shiva. For now, it is confirmed that Naga Chaitanya is doing the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu