»   » సాయిధరమ్ తేజ్ తమ్ముడు హీరోగా సినిమా... డైరెక్టర్ అతడేనా!

సాయిధరమ్ తేజ్ తమ్ముడు హీరోగా సినిమా... డైరెక్టర్ అతడేనా!

Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు నటిస్తున్నారు. ఆ జాబితాలోకి మరో హీరోకి జాయిన్ కాబోతున్నాడు. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలో హీరోగా మారబోతున్నాడు. వైష్ణవ్ డెబ్యూ మూవీ కోసం అంతా సిద్ధం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

ఆయనే వైష్ణవ్ డెబ్యూ మూవీని కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడిగా అడుగుపెట్టినా తేజు హీరోగా సత్తా చాటాడు. తేజు తమ్ముడు వైష్ణవ్ నటుడిగా ఏమేరకు రాణిస్తాడో అని ఆసక్తి నెలకొని ఉంది. వైష్ణవ్ ని మొదట దిల్ రాజు లాంచ్ చేయాలని భావించాడట. కానీ ఆ అవకాశం సాయి కొర్రపాటి కి దక్కినట్లు తెలుస్తోంది.

Avasarala Srinivas to direct Sai Dharam brother.

తేజు మొదటి చిత్రం రేయ్ అయినప్పటికీ, దిల్ రాజు నిర్మించిన పిల్లా నువ్వులేని జీవితం మొదట విడుదలైంది.వైష్ణవ్ మొదటి చిత్రానికి ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శత్వం వహిస్తాడని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది.

English summary
Avasarala Srinivas to direct Sai Dharam brother. Vaishnav Tej debut movie starts soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X