For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవసరాల శ్రీనివాస్ నెక్ట్స్ ప్రాజెక్టు వివరాలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడుగా మారిన అవసరాల శ్రీనివాస్ తన తదపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. నాగార్జునతో ఆయన నెక్ట్స్ సినిమా చేయనున్నారని సమాచారం. రీసెంట్ గా నాగార్జునకు స్టోరీలైన్ వినిపించారని, రొమాంటిక్ కామెడీగా కథనం రూపొందించుకు వచ్చారని, కూల్ గా ఉండే కథతో ఉంటుందని తెలుస్తోంది. వెంటనే నాగార్జున ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు. స్క్రిప్టు పూర్తిగా విన్న తర్వాత నాగార్జున తమ సొంత బ్యానర్ పై ఈ చిత్రం చేస్తారని అంటున్నారు.

  మరో ప్రక్క ఎన్టీఆర్‌, నాగార్జున కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నాగార్జున వద్ద ప్రస్దావిస్తే ఆయన నిజమేనని అనటమే కాక చాలా ఎక్సైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.... అవును. వంశీ పైడిపల్లి కథ వినిపించాడు. చాలా బాగా నచ్చింది. అందరికీ షాకిచ్చే పాత్ర నాది అన్నారు.

   Avasarala Srinivasa directs Nag

  ఇక నాగార్జున సూపర్ హిట్ టీవి షో...'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి త్వరలో బ్రేక్ ఇవ్వబోతోంది. ఆగస్ట్ 7న ఈ షో చివరి ఎపిసోడ్(40) ప్రసారం అవుతుంది. తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుని సీజన్ 2 తో మళ్లీ వస్తారు. ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యిందని,తన మనస్సుకు బాగా నచ్చిన షో అని నాగార్జున అన్నారు.

  నాగార్జున మాట్లాడుతూ... 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా ఆడియన్స్ తో నేరుగా కలిసే అవకాశం లభించింది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రతి క్షణం ఎంతగానో ఎంజాయ్ చేశాను. నా మనసుకు దగ్గరైన కార్యక్రమం ఇది అని అని చెప్పుకొచ్చారు. అలాగే....పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు.

  అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ షో దిగ్విజయంగా 40 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోవటంతో మాటీవి యాజమాన్యం సైతం చాలా సంతోషంగా ఉంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఓ గేమ్ షో ప్రసారం కానుండటం ఇదే ప్రథమం.

  ఇంతకాలం సినిమాల ద్వారా వినోదం పంచుతూ వచ్చిన తాను మొదటిసారి టెలివిజన్ తెరపైకి వచ్చానని నాగార్జున అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ గేమ్ షోకు ప్రయోక్తగా వ్యవహరించాననీ, అమితాబ్ ముద్రను అందుకోవడం చాలా కష్టమని తెలుసనీ, తన శక్తివంచన లేకుండా బాగా చేయడానికి కృషి చేసాననీ చెప్పారు. చాలా మంది సామాన్య పౌరుల కలల్ని నిజం చేయడం ద్వారా వారి జీవితాల్ని ఈ షో మార్చుతోందని ఆయన అన్నారు.

  English summary
  Avasarala Srinivas who has scored a hit as director with ‘Oohalu Gusagusalade’ is flying high for getting an offer to direct King Nagarjuna’s next film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X