»   » కక్కుర్తో,ముందు జాగ్రత్తో...నిర్మాతలు మాత్రం గోల

కక్కుర్తో,ముందు జాగ్రత్తో...నిర్మాతలు మాత్రం గోల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలన్నది నిజమే కానీ, అందుకూ ఓ పద్దతీ,పాడు ఉంటుందని విసుక్కుంటున్నారు దర్శక,నిర్మాతలు. యాభై లక్షలు దాకా రెమ్యునేషన్ తీసుకుని డేట్స్ విషయంలో ఇబ్బంది పెడుతోందని వాపోతున్నారు. పోనీ వేరే సినిమాలు చేస్తోందా అంటే అదేమీ లేదని ఆమె దృష్టి ఇప్పటికీ సీరియల్స్ మీదే ఉందని అంటున్నారు. ఆమె టీవీ సీరియల్స్ కు ఇచ్చిన ప్రయారిటీ సినిమాలకు ఇవ్వటం లేదని అంటున్నారు. ఇదే కక్కుర్తితో ముందుకు వెళితే ఆమె కెరీర్ కే ప్రమాదం అంటున్నారు. ఇంతకీ ఎవరి గురించి అంటారా..ఆమె అవికాగోర్. అయితే మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకపోసుకోను, సినిమాలను పూర్తిగా నమ్మలేం కదా, టీవీ సీరియల్స్ నన్ను ఈ స్దితికి తెచ్చాయి..వాటిని వదిలే ప్రసక్తిలేదని చెప్తోందని సమాచారం.

చిన్న చిత్రాల్లో మంచి విజయం సాధించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా' హీరోయిన్ అవికా గోర్. ఈ చిత్రం హిట్ ఈమెకు బాగానే కలిసి వచ్చింది. ఆమెకు వరస ఆఫర్స్ వచ్చినా ఆచితూచి అడుగులు వేస్తోంది. తను డిమాండ్ చేసిన రెమ్యునేషన్ ఇచ్చేవాళ్లు,బ్యానర్ వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఓకే చేస్తోంది. తాజాగా ఆమె మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెక్కం వేణు గోపాల్ నిర్మిచే చిత్రం ఆమె సైన్ చేసిందని సమాచారం. ఈ చిత్రం ద్వారా మురళీధర్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.

Avika Gor troubling producers

అలాగే రచయిత నంధ్యాల రవి దర్శకత్వంలో రూపొందే లక్ష్మీ రావే మా ఇంటికి...చిత్రం ఆమె చేస్తోంది. జర్నలిస్ట్ అయిన గిరిధర్ నిర్మిస్తున్న ఈ సినిమా లాంచ్ అయ్యి షూటింగ్ జరుగుతోంది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇలా ఈ రెండు చిత్రాలు కొత్త దర్శకులతోనే కావటం విశేషం.

'ఉయ్యాలా జంపాలా'కు ముందే అవికాగోర్ తెలుగువారికి పరిచయం. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో ఆంధ్రప్రదేశ్ లో మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తో ఈ చిత్రానికి ఓపినింగ్స్ సైతం రాబట్టుకుంది. నాగార్జున, హిట్‌ చిత్రాల నిర్మాత రామ్మోహన్‌ పి. నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా రూపొంది విడుదలైంది.

ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీ తో కలిపి రెండున్నర కోట్లు బడ్జెట్ అయిన ఈ చిత్రం 17 కోట్లు(గ్రాస్)కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ లో పెద్ద సినిమాతో పోటీ పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

English summary
Though Avika Gor of ‘Uyyala Jampala’ fame is getting good offers in films, as she is not keen to leave small screen serials hence filmmakers are facing troubles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu