»   » మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మకు ఏవియస్ ట్విస్ట్

మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మకు ఏవియస్ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తాజాగా ఏవియస్ రూపొందిస్తున్న 'కోతిమూక' చిత్రానికి సంగీతం అందిస్తున్నారంటూ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మణిశర్మ ఏమిటీ ఓ చిన్న లో బడ్జెట్ కామెడీ చిత్రానికి సంగీతం అందించటం ఏమిటీ అంతా ఆశ్చర్యపోయారు. అయితే అసలు విషయం ..అస్సలు మణిశర్మను సంప్రదించకుండానే ఏవీయస్ ఆ ప్రకటన చేసాడని చెప్తున్నారు. ఎందుకంటే ఏవీయస్ తన తొలి సినిమా సూపర్ బ్రదర్స్ తో మణిశర్మను సంగీత దర్శకుడుగా పరిచయం చేసారు. ఆ చనువుతో మణిశర్మతో ఇలా ఆడుకుంటున్నాడని అంటున్నారు. స్టార్ గా వెలుగుతున్న మణిశర్మ కెరీర్ ని ఇలా ఏవీయస్ ఇబ్బంది పెట్టడం ఎంత వరకూ భావ్యమని ఫిలిం సర్కిల్స్ లో వినపడుతోంది. అందులోనూ ఆ మధ్య ఏవీయస్...మణి శర్మ 50 వ చిత్రమంటూ తన రూమ్ మేట్స్ చిత్రానికి ప్రమేట్ చేసుకున్నాడు. అప్పుడీ మొహమాటంతోనే మణిశర్మ ఏమీ అనలేకపోయారుట. అస్సలు ఏవీయస్ తో తిరిగి సినిమా మొదలు పెట్టడం అనే ప్యాకేజీ వెనక మణిశర్మ సంగీతం అనే ప్లస్ పాయింట్ లేకపోతే ముందుకు వెళ్ళేదే కాదంటున్నారు. ఏదైమైనా మణిశర్మకు ఇది తప్పని సరి బంధమై కూర్చుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu