»   » ఉయ్యాలవాడ కథ పరుచూరి బ్రదర్స్ ది కాదు!

ఉయ్యాలవాడ కథ పరుచూరి బ్రదర్స్ ది కాదు!

Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ ఇప్పుడు రంగంలోకి వచ్చాడు. బాలకృష్ణ హీరోగా జయంత్ దర్శకత్వంలో ఒక సినిమా "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" రూపొందబోతోందన్న విషయం తెలిసిందే. ఈ కథ విషయంలో ఒక బలమైన వివాదముంది. ఈ చారిత్రక గాధను మొదట నవలా రూపంలోకి తెచ్చిన రచయిత కర్నూలుకు చెందిన ఎస్ డివి అజీజ్. చిరంజీవి హీరోగా ఆ పాత్రను ధరించాలనుకున్నప్పుడు పరుచూరి బ్రదర్స్ ఆ సినిమా కోసం కథను రెడీమేడ్ దుస్తుల్లా సిద్ధం చేశారు.

నిజానికి ఆ కథను కర్నూలుకు చెందిన అజీజ్ అనే రచయిత 20 ఏళ్ళ క్రితమే నవలా రూపంగా తీసుకు వచ్చాడు. ఈ రచయిత "వీరనారి", "గాంధీజీ పర్యటన", "తెరణికంటి ముట్టడి" జాతీయ నాటక అవార్డు పొందిన "సామా" రచనలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కోస్తా ఆంధ్ర జిల్లాలకు చెందిన పరుచూరి బ్రదర్స్ రాసేది ఏముంటుంది? బాలకృష్ణకు సరిపడే డైలాగ్స్ వాళ్ళు రాయగలరు గానీ కర్నూలు జిల్లా చరిత్ర వాళ్ళకి పెద్దగా తెలియదు.

ఈ సినిమా కథకు సంబంధించి అజీజ్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాయర్లను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన రాసిన ఉయ్యాలవాడ జీవిత గాధ ఇరవై ఏళ్ళ తర్వాత రెండో ముద్రణగా ఈ వారంలో వచ్చింది. జయంత్ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విషయంలో ఇప్పటికే చాలా వివాదముంది. ఈ నవలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అజీజ్ దేనన్న విషయం జయంత్ దృష్టికి ఇప్పటికే వచ్చింది.

ఈ చారిత్రక నవలను ఎన్టీ ఆరామారావు 1989లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఆ విషయం హీరో బాలకృష్ణకు తెలుసు. ఈ నవల ఆధారంగా జయంత్ రూపొందించనున్న ఈ చిత్రానికి సంబందించి ప్రధానంగా ఈ అంశమే ముందుకు రానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu