»   »  'బాహుబలి -2': అనుష్క...దేవసేన పాత్రలో షాకింగ్ ఎలిమెంట్ ?

'బాహుబలి -2': అనుష్క...దేవసేన పాత్రలో షాకింగ్ ఎలిమెంట్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం లో అనుష్క పాత్ర గురించి ఓ చిత్రమైన టాక్ బయిలు దేరింది.

వినపడుతున్నదాన్ని బట్టి....దేవసేన (అనుష్క పాత్ర)పై ఓ ఇంటెన్స్ రేప్ సీన్ ఉందని తెలుస్తోంది. బాహబలి(ప్రభాస్),భల్లారిదేవ(రానా) ఇద్దరూ దేవసేన కోసం ఫైట్ చేస్తారని అంటున్నారు. అది పెద్దదై దేవసేన ని రేప్ చేసే ప్రయత్నం దాకా వెళ్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకూ నిజమనేది సెకండ్ పార్ట్ రిలీజ్ అయితేనే కానీ తెలియదు.


మరోప్రక్క ముంబై మీడియా ఓ వార్తను ప్రచారం చేస్తోంది. హిందీ వెర్షన్ ని ప్రమోట్ చేసిన కరుణ్ జోహార్ ఈ సెకండ్ పార్ట్ విషయంలో రాజమౌళి పై చాలా ప్రెజర్ తెస్తున్నారని.


Baahubali 2 :Shocker on Devasena character

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇంతకీ ఏంటా ప్రెజర్ అంటే...నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి...సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ని తీసుకోమని చెప్తునానారట. అంతేకాదు...రాజమౌళి ఏ ఆర్టిస్టులను అయితే అడుగుతారో వారిని ఖచ్చితంగా తీసుకువస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రాజమౌళి ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎంతవరకూ నార్త్ ఫేస్ లు మనకు ఇక్కడ సౌత్ లో వర్కవుట్ అవుతారనేది కూడా డిస్కస్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.


'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.


టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.

English summary
It is coming out that there will be intense rape scene on Devasena (Anushka) in the Baahubali second part.
Please Wait while comments are loading...