»   » మొదటిసారి 'బాహుబలి' బయిటకు వచ్చి ఫ్యాక్టరీలో

మొదటిసారి 'బాహుబలి' బయిటకు వచ్చి ఫ్యాక్టరీలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రభాస్, రాణా, అనుష్క, మరియు తమన్నా మఖ్య పాత్రల్లో నటించిన చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత సంవత్సరం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇప్పుడు రెండో పార్ట్ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుకుంటోంది.

అయితే ఇన్నాళ్ళూ హైదరాబాద్ లో షూటింగ్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటేవారు కాదు. కానీ ఇప్పుుడు సీన్ మారింది. ప్రస్తుతం బాహుబలి పార్ట్ టూ ...ది కంక్లూజన్ కి సంబందించిన షూటింగ్ హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో వున్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ భారీ ఎత్తున సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. లీడ్ రోల్స్ వున్న వాళ్లందరు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.


గత నాలుగు సంవత్సరాలనుండి మనం గమనిస్తే... హైదరాబాద్ లో వేరే లోకేషన్ లో షూటింగ్ జరుపుకోవడం ఇదే మెదటిసారి అని చెప్పాలి. ఎప్పుడు రామెజీఫిల్మ్ సిటిలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతూంటుంది. చాలా పగడ్బందీగా ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారు.


 Baahubali 2 Shooting at Aluminum Factory

రాజమౌళి ఈ పార్ట్ టు ని మొదట భాగాన్ని మించి సక్సెస్ చేయాలని ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. బాహుబలి ది బిగినింగ్ కంటే రెండు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది.


మొన్నీ మధ్యే కేరళ లోని ఫారెస్ట్ లో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాకు సంగీతం కీరవాణీ అందిస్తుండగా, రమ్యకిృష్ణ, సుదీప్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Currently ‘Baahubali’ makers are shooting important scenes in Aluminum Factory near the outskirts of Hyderabad city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu