»   » 15 వ శతాబ్దం నాటి కోటలో రాజమౌళి

15 వ శతాబ్దం నాటి కోటలో రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి తన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి కు సీక్వెల్ ‘బాహుబలి - ది కంక్లూజన్'కి రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ లొకేషన్స్ విషయంలోనూ ఆయన చాలా పెడుతున్నారు. తొలి చిత్రం కన్నా ఈ సీక్వెల్ ని మరింత పెద్ద హిట్ చేయాలని ఆయన కష్టపడుతున్నారు. ఇంతకాలం హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కేరళలకు మారింది. అక్కడ ఓ పురాతన కోటను లొకేషన్ గా ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

కేరళలోని అతి పురాతనమైన కన్నూర్ ఫోర్ట్‌ లో ఆయన షూటింగ్ చేయనున్నారు. పదిహేనవ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించిన కోట ఇది. ఈ కోటలో రేపటి నుండి 10 రోజుల పాటు ‘బాహుబలి' సినిమా షూటింగ్ జరుగనుంది. ప్రభాస్‌తో పాటు సినిమాలోని కీ రోల్స్ లో కనిపించే నటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు.


Baahubali 2 Shooting At Famous Fort In Kerala

ఈ షూటింగ్ లో కొన్ని యుద్ద సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందు బుల్ ఫైట్ సీన్‌కు సీక్వెల్‌గా కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించిన యూనిట్ మిగతా సన్నివేశాలను కేరళలో తెరకెక్కించనున్నారు.


ముఖ్యంగా బాహుబలి సీక్వెల్ పై పెరిగిపోయిన అంచనాల అందుకునేందుకు పార్ట్ 2 లో ఒక గంట పాటు వచ్చే వార్ ఎపిసోడ్ ని పూర్తిగా రీ డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తైన సెకండ్ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఇంకా 120 రోజులపైనే షూటింగ్ చేయాల్సి ఉంది.


Baahubali 2 Shooting At Famous Fort In Kerala

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.

English summary
SS Rajamouli's 'Baahubali 2' makers are planning to shoot the movie in the historical Kannur fort in Kerala, which is also known St. Angelo Fort and built by the Portuguese.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu