twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి ఆడియో నాని యాంకరింగ్ చేయడం లేదు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి ఆడియోకు హీరో నాని యాంకరింగ్ చేస్తారని గతంలో రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న విధంగా మే 31న ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగి ఉంటే నాని వచ్చేవాడేమో. కాని నేడు(జూన్ 13) తిరుపతిలో జరుగుతున్న ఆడియో వేడుకకు నాని రావడం లేదు. నాని స్థానంలో యాంకర్ సుమ ఆడియో వేడుకను హోస్ట్ చేయబోతున్నారు.

    ‘అనుకోకుండా నాని షూటింగులో గాయపడ్డారు. అందుకే రావడం లేదు. బాహుబలి ఆడియో వేడుకకు సుమ గారు యాంకరింగ్' చేస్తారు అని రాజమౌళి స్పష్టం చేసారు.

    కాగా...ఈ ఆడియో వేడుక నిర్వహణను రాజమౌళి బాహుబలి టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజమౌళితో పాటు ప్రధాన యూనిట్ మెంబర్స్ అంతా అక్కడే తిష్టవేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆడియో వేడుకను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పూర్తిస్థాయి వ్యూహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భద్రతా ప్రణామాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

    BAAHUBALI AUDIO: No Buzz For Audio Release

    బాహుబలి ఆడియో వేడుక ఏర్పాట్ల గురించి రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...బాహుబలి ఆడియో వేడుకు సంబంధించిన ఏర్పాట్లు పోలీస్ డిపార్టుమెంట్, బాహుబలి టీం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడియో వేడుకకు చిన్న పిల్లలను, పెద్ద వారిని తీసుకురావొద్దని రాజమౌళి అభిమానులకు విన్నవించారు.

    ఆడియో వేడుకకు సంబంధించిన పాసులు అమ్మడం లేదు. ఎవరైనా అమ్మినా కొనవద్దు. అలా కొన్నారంటే అవి డుప్లికేట్ పాసులే. ప్రభాస్ అభిమాన సంఘాలకు పాసులు స్వయంగా అందించాం. అభిమాన సంఘాల అధ్యక్షులు, రానా మేనేజర్స్ వద్ద పాసులు లభిస్తున్నాయి అని రాజమౌళి తెలిపారు.

    English summary
    Earlier, it was announced that hero Nani will be hosting the audio event of Baahubali, But due to unavoidable circumstances the program has been postponed to a further date and now, the audio launch is finally going to take place today at 6PM. Unfortunately, the problem has bit our Eega, Nani this time. "Unfortunately Nani got hurt in his Shoot and is unable to make it to the event... It will be Suma garu all the way, tomorrow..", Rajamouli tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X