»   » బాబు వల్ల పాప కూడా బాగానే బిజీ అయ్యింది... కానీ..

బాబు వల్ల పాప కూడా బాగానే బిజీ అయ్యింది... కానీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీసెంట్‌గా అవసరాల శ్రీనివాస్ నటించిన అడల్ట్ కామెడీ 'బాబు బాగా బిజీ' బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన మొదటి షో నుండే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా అటు దర్శకనిర్మాతలకు గానీ హీరోకి గానీ కలిసొచ్చిందేమీ లేదు. కానీ ఒకరికి మాత్రం ఈ సినిమా బాగా ప్లస్ అయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో చిన్న పాత్ర చేసి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సుప్రియా ఐసోలా...

బాబు బాగా బిజీ

బాబు బాగా బిజీ

"బాబు బాగా బిజీ". ఆ సినిమాలో ఆంటీగా నటించిన సుప్రియ శృంగార భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. కేవలం సుప్రియను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు సినిమాకు ఇప్పటికీ వస్తున్నారట. అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో నటించిన సుప్రియకు మాత్రం చాలా బాగా పేరు వచ్చిందట.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

గతంలో సుప్రియ ఐసోలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించింది. మహేశ్‌బాబుతో కలిసి ట్రైన్ సీన్‌లో నటించింది. మహేశ్‌బాబు ఫోన్ మరిచిపోతే మీరు ఫోన్ మరిచిపోయారు అని డైలాగ్ చెప్పే సీన్‌లో కనిపించారు. అందుకు మహేశ్ కావాలనే మర్చిపోయాను అంటాడు..

అడ్రస్ సీన్‌ బాగా పడింది

అడ్రస్ సీన్‌ బాగా పడింది

అయితే డైరెక్ట్‌గా చెప్పవచ్చుగా అని సుప్రియ అంటుంది. రైల్వేస్టేషన్‌లో దిగి వస్తుంటే వెంకటేష్ ఎదురు రాగా మహేశ్ దారి అటూ అంటూ అడ్రస్ సీన్‌ బాగా పడింది. చిన్న సీన్‌లో కనిపించిన సుప్రియకు తగిన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దూరమైంది.

బోల్డ్ యాక్టింగ్ చూసి

బోల్డ్ యాక్టింగ్ చూసి

సినిమాల్లో లీడ్ రోల్స్ చేసింది.కానీ జనాలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాబు బాగా బిజీలో అమ్మడి బోల్డ్ యాక్టింగ్ చూసి ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇండస్ట్రీ నుండి ఆమెను వరుస అవకాశాలు వస్తున్నాయని సమాచారం. అన్ని సినిమాల్లో చేసినా రాని గుర్తింపు ఈ సినిమా తో వచ్చేసింది.

సెక్సీ గా కవ్వించే పాత్రలకే

సెక్సీ గా కవ్వించే పాత్రలకే

దాదాపు ఏడు నుండి ఎనిమిది సినిమాల ఛాన్సులు ఆమె దగ్గరకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే వెళ్ళిన పాత్రలన్నీ బాబు బాగా బిజీలో చేసిన పాత్రల లాంటివేనట. ఈ సినిమాలో చేసిన సెక్సీ గా కవ్వించే పాత్రలకే తాను సూట్ అవుతానని భావించే వారిసంఖ్య పెరిగి పోవటం తో ఇప్పుడు ఆనంద పడాలో, తనమీద పడ్డ ముద్ర కి భాదపడాలో అర్థం కావటం లేదట...

అలాంటి క్యారెక్టర్లు చేస్తే

అలాంటి క్యారెక్టర్లు చేస్తే

కొత్తగా రానున్న సినిమాల్లో సుప్రియకు ప్రత్యేక క్యారెక్టర్లు ఇస్తాం.. రమ్మని నిర్మాతలు సుప్రియ ఇంటి ముందు క్యూ కట్టారట. అయితే సుప్రియ మాత్రం నిర్మాతల వినతులను సున్నితంగా తిరస్కరిస్తున్నారట. అలాంటి క్యారెక్టర్లు చేస్తే మళ్లీ తనకు అవకాశం రాకపోవచ్చని చెబుతోందట.

అదే ముద్ర పడిపోతుందని

అదే ముద్ర పడిపోతుందని

అంతేకాదు హీరోయిన్‌గా అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను గానీ.. హీరోయిన్ పక్కన క్యారెక్టర్లు చేయనని చెబుతోందట. వరుసగా ఎక్స్ పోజింగ్ పాత్రలే చేస్తే ఆమెపై అదే ముద్ర పడిపోతుందని భావిస్తోంది. కొన్ని రకాల పాత్రలు గుర్తింపు తెచ్చినా ఇబ్బందే అన్నమాట... మరి ఈ విషయంలో సుప్రియ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

English summary
Babu Baga Busy Actress Supriya Isola now Busy with offers but she is not happy with her sexy Image
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu