»   » బద్రినాధ్ లో బాలీవుడ్ చాక్ లెట్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ కూడానా..!

బద్రినాధ్ లో బాలీవుడ్ చాక్ లెట్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ కూడానా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివి వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం బద్రినాధ్. ఇటీవల ఈ చిత్రంలో బాలీవుడ్ చాక్ లెట్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ కూడ ఒక ముఖ్యభూమికను పోషిస్తున్నారని రూమర్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దీనితో చాలా మంది ఇమ్రాన్ ఖాన్ ఎటువంటి పాత్రలో కనిపించనున్నారని ఆశక్తి కలిగింది. ఈ విషయంపై స్పందించిన అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరిష్ తన ట్విట్టర్ లో ఈ సినిమాలో బాలీవుడ్ చాక్ లెట్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ నటిస్తున్నారన్న వార్త ఉత్త పుకారు మాత్రమే అన్నారు. అసలు ఈ సినిమా కధకి ఇమ్రాన్ ఖాన్ సంబంధమే లేదన్నారు. నేను కూడా ఈ రూమర్ విని ఆశ్చర్యపోయిన వారిలో ఒకరు అని తెలిపారు.

ప్రస్తుతం బధ్రినాధ్ యూనిట్ అంతా రెండు నెలలు పాటు కులుమనాలిలో షూటింగ్ పూర్తి చేసుకోని హైదరాబాద్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని ప్రయుఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu