»   » మహేంద్ర బాహుబలిగా ఈ చిన్నారి ఎవరో తెలుసా?.. సోషల్ మీడియాలో హల్‌చల్..

మహేంద్ర బాహుబలిగా ఈ చిన్నారి ఎవరో తెలుసా?.. సోషల్ మీడియాలో హల్‌చల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో ఆరంభంలోనే కనిపించే సన్నివేశం అదరగొట్టేసింది. మహేంద్ర బాహుబలి ప్రాణాలను రక్షించడం కోసం రాజమాత శివగామి ప్రాణత్యాగానికి సిద్ధపడటం తెరపై ప్రేక్షకుడిని కట్టిపడేసింది. నదీ ప్రవాహంలో శివగామి మునిగిపోతూ ఓ చేతిలో పసిబిడ్డను పైకెత్తే సీన్ బాహుబలి సిరీస్‌కే హైలెట్ అని అంటే అతిశయోక్తి కాదేమో. ఆ చిన్నారిని రక్షించిన గిరిజన తెగ‌కు చెందిన కొందరు పెంచి పెద్ద చేసి శివుడు అని పేరు పెట్టుకోవడం తెలిసిందే. ఆ పసిపాపకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  శివగామి చేతిలో..

  శివగామి చేతిలో..

  శివగామి చేతిలో కనిపించిన చిన్నారి ముద్దు ముద్దుగా కనిపించింది. ఆ పాప అమ్మాయి అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ పాపనే పెరిగి శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలి( ప్రభాస్)గా మారే సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో కీలక సన్నివేశంలో కనిపించిన పాప ఎవరు అనే ప్రశ్న వెంటాడుతున్నది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం ఆ అమ్మాయి పేరు అక్షిత వల్సాలాన్ అని వినిపిస్తున్నది.


  18 రోజులపాటు షూటింగ్

  18 రోజులపాటు షూటింగ్

  బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రంలో చాలా కీలకమైన సన్నివేశాల్లో అక్షిత కనిపించింది. ఆ పాపను దాదాపు 18 రోజులపాటు షూటింగ్‌కు ఉపయోగించుకొన్నారట. షూటింగ్ జరిగే సమయంలో చిన్నారిని యూనిట్ సభ్యులు చాలా జాగ్రత్తగా చూసుకొన్నట్టు సమాచారం.


  సోషల్ మీడియాలో హల్‌చల్

  సోషల్ మీడియాలో హల్‌చల్

  ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభాస్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను కథనాల రూపంలో ప్రచురిస్తూ హడావిడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ చిన్నారిని ప్రభాస్ ఎత్తుకొన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తున్నది. ప్రభాస్ చేతిలో ఉన్నది అక్షిత అని, ఐదేళ్ల వయసులో ప్రస్తుతం ఇలా కనిపిస్తున్నదనే ప్రచారం జరుగుతున్నది.


  ప్రభాస్‌కు చిన్నపిల్లంటే ఇష్టమట..

  ప్రభాస్‌కు చిన్నపిల్లంటే ఇష్టమట..

  ఇదిలా ఉండగా, బాహుబలి ప్రభాస్‌కు చిన్న పిల్లలంటే చాలా ఇష్టమట. పిల్లలతో కలిసి ఉండటమంటే చెప్పలేని ఆసక్తిని కనబరుస్తాడని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. పిల్లలను ముద్దు చేస్తూ తాను పసిపిల్లాడిలా మారిపోతుంటారని వినికిడి. అంతేకాకుండా ప్రభాస్ పక్షి ప్రేమికుడనే విషయం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిసింది.


  1500 కోట్ల వైపు పరుగులు

  1500 కోట్ల వైపు పరుగులు

  ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 హవా కొనసాగడం, కేవలం పది రోజుల్లోనే ఆ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఇదే ఊపు కొనసాగితే బాహుబలి2 సినిమా రూ.1500 కోట్లకు సునాయసంగా చేరుతుందనే మాట బలంగా వినిపిస్తున్నది.  English summary
  The Baahubali actor's this picture of embracing a baby in his arm is a sight too cute to be missed. The way Prabhas is admiring the little baby in his arms will instantly put a big smile across your face. This picture of the actor goes viral amongst the fans and is the cutest thing you will see today. A report suggests that the baby is girl named Akshitha Valslan. The scenes shot over a period of 18 days for Baahubali1.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more