For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్రభాస్ ‘బాహుబలి’ ఆన్ లైన్ లో ...

  By Srikanya
  |
  హైదరాబాద్ : రాజమౌళి,ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. ఈ చిత్రం రిలీజ్ ని భారీగా ...అన్ని వర్గాలుకు చేరువయ్యేలా చేయాలని,అదే సమయంలో పైరసీని దెబ్బకొట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఓ ఆన్ లైన్ మూవీ వెబ్ సైట్ ని స్వయంగా నెలకొల్పారు. అందులో డబ్బు కట్టి...సినిమాలు ఉత్తమ నాణ్యతతో చూడవచ్చు. బాహుబలి విడుదల నాటికి ఆ సైట్ పాపులర్ అవుతుందని, అందులోనే ఈ సినిమా ఆన్ లైన్ వెర్షన్ ని విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే హిందీలో కొన్ని సినిమాలు ఆన్ లైన్ లో అదే రోజు విడుదల అవుతున్నాయి.


  దర్శకుడు రాజమౌళి, సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా 'రిలీజ్‌డే.కామ్' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలోనే ఓ వినూత్న ప్రయత్నంగా యావత్ప్రపంచంలోని భారతీయ వెండితెర అభిమానుల కోసం నెలకొల్పిన అత్యాధునిక నిరంతర సినీ ప్రవాహవాణిగా దీన్ని వారు అభివర్ణించారు. "అత్యున్నత ప్రమాణాలతో అలరిస్తున్న ఆన్‌లైన్ వాణిజ్య పరిశ్రమలోకి శరవేంగా దూసుకెళుతూ ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరిగే సినిమా వీక్షకుల్నీ, అభిమానుల్నీ అలరించడమే రిలీజ్‌డే.కామ్ ప్రధాన లక్ష్యం.

  పలు ప్రపంచదేశ మార్కెట్లలో తెలుగు సినిమా విడుదల, ప్రదర్శన ఊహించిన స్థాయిలో జరగడం లేదు. ఈ సమస్యే రిలీజ్.కామ్‌కు అంకురార్పణ చేసి, ఒరిజినల్ కంటెంట్ తాలూకు డిమాండ్, సప్లయ్ నడుమ వారధిగా మారనుంది. తమ సినిమాని ఏ ప్రాంతాల్లో ప్రదర్శించాలో అనే విషయం మొదలుకొని ఆ ప్రదర్శనకు ఎంత చార్జీ వసూలు చేయాలనే విషయం వరకు అన్నీ ఇమడి ఉన్న పరిపూర్ణ అధికారాన్ని నిర్మాతలకు ఇవ్వడం ఈ వెబ్‌సైట్ ఏర్పాటు ప్రధానాంశం. ఈ నిరంతర ప్రసార మాధ్యమాన్ని రోబస్ టెక్నాలజీలో దృఢమైన యాంటీ పైరసీ అంశాలతో, పూర్తి పారదర్శకతతో అటు నిర్మాతలకీ, ఇటు వినియోగదారులకీ పరస్పరం లాభదాయకంగా ఉండే రీతిలో దీన్ని తయారు చేశాం'' అని వారు వివరించారు.

  ఇక రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీస్తున్న సినిమా 'బాహుబలి'. ఈ సినిమాలో మరో నటి రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్, రానాల తల్లిగా నటించి మెప్పించనుంది. తన సిని కెరీర్ లో ఎన్నో పాత్రల్లో నటించి అందరిని మెప్పించిన తను రాజసం ఉట్టిపడే ఈ పాత్రకి సరైన న్యాయం చేస్తుందని అందరూ బావిస్తున్నారు. ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా ఈ సినిమాలో రానా విలన్ గా కనిపించనున్నాడు. ఆర్క మీడియా బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

  English summary
  Rajamouli who known for his publicity skills again came up with new idea.Rajamouli had decided to launch his own website which is to be named as release today.com.The website consists information about all his movies and it is a online movie streaming website.Rajamouli along with Arka media is launching the website and the speciality of this site is free online viewing of numerous new and old Telugu movies.
 Of course, for watching movies we need to pay the amount.One more feature of the website is that people who living in foreign countries can watch the movies on the release day itself.Really a great move from Rajamouli and of course it might be a quite commercial game. So get ready to watch Jakkanna Baahubhali releaseday .
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more