Just In
- 32 min ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 34 min ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
- 1 hr ago
చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్
- 1 hr ago
సలార్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.. హై వోల్టేజ్ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
Don't Miss!
- Sports
ఒకే ఓవర్లో 28 రన్స్.. విరాట్ కోహ్లీ ఉగ్రరూపం.. బ్యాటింగ్ కింగ్‌గా మారిన క్షణం!
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- News
కూతురి మాటలకు, పీవీ బతికుంటే ఆత్మహత్య -సీపీఐ నారాయణ సంచలనం -ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ నాగేశ్వర్
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కల్యాణ్‌తో బాహుబలి రైటర్.. మరో బిగ్ బడ్జెట్ మూవీ ప్లానింగ్..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. వీలైనంత వరకు చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేయాలని బాగానే కష్టపడుతున్నారు. ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు అంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే పవర్ స్టార్ ఒప్పుకుంటే రెండేళ్ల తరువాత కూడా సినిమా చేయడానికి కొంతమంది రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కోసం ఒక సీనియర్ రైటర్ కథ కూడా రెడీ చేస్తున్నట్లు టాక్ వస్తోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా..
పవన్ కళ్యాణ్ తన 25ఏళ్ళ సినిమా కెరీర్ లో ఇప్పటివరకు వరుసగా నాలుగైదు సినిమాలను ఎనౌన్స్ చేయలేదు. గతంలో అయితే చాలా వరకు ఒక దాని తరువాత మరొకటి చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక బిగ్ స్క్రీన్ హీరో కంటే కూడా తన పర్సనల్ లైఫ్ స్టైల్ తో అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నాడు.

మూడేళ్ళ తరువాత వస్తున్న సినిమా..
ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ నుంచి దాదాపు మూడేళ్ళ అనంతరం వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 100కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది.

మార్కెట్ స్థాయిని పెంచేలా..
హిట్టయినా ప్లాప్ అయినా కూడా ఒకే రకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకునే పవన్ వకీల్ సాబ్ అనంతరం మాత్రం డిఫరెంట్ లైనప్ ను సెట్ చేసుకున్నాడు. ఆ సినిమాలు తప్పకుండా మార్కెట్ స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లడం కాయంగా కనిపిస్తోంది. అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దానికి చెందిన ఒక హిస్టారికల్ కథను చేస్తున్న విషయం తెలిసిందే.

పవన్ కోసం బాహుబలి రైటర్
హరీష్ శంకర్, సురేంధర్ రెడ్డి వంటి దర్శకులను కూడా లైన్ లో పెట్టిన పవన్ కుదిరితే బాహుబలి రైటర్ రాస్తున్న కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని తెలుస్తోంది. రైటర్ విజయేంద్ర ప్రసాద్ పవన్ కోసం చాలా కాలంగా ఒక కథను రాయాలని అనుకుంటున్నాడట. ఇక పవన్ కు ఐడియా చెప్పగానే కథను డెవలప్ చేయమని చెప్పేశారని ఒక టాక్ అయితే వస్తోంది. ప్రస్తుతం స్టోరీని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్న విజయేంద్ర ప్రసాద్ వీలైనంత త్వరగా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి మరోసారి పవన్ కు వినిపిస్తారని తెలుస్తోంది. మరి ఆయన రాసే కథను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.