పవర్ ఫుల్ కథలో.. తండ్రి, కొడుకులుగా బాలయ్య, ఎన్టీఆర్!
శతమానం భవతి చిత్ర విజయంతో ఊపు మీద ఉన్న దిల్ రాజు మంచి పవర్ ఫుల్ గా ఉన్న తండ్రి కొడుకుల కథను సినిమాగా మలిచేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
తెలుగు వెండితెరపై అరుదైన కాంబినేషన్ ఆవిషృతం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శతమానం భవతి చిత్ర విజయంతో ఊపు మీద ఉన్న దిల్ రాజు మంచి పవర్ ఫుల్ గా ఉన్న తండ్రి కొడుకుల కథను సినిమాగా మలిచేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఈ చిత్రాన్ని నందమూరి వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందనే టాక్ వినిపిస్తున్నది. వీలైతే బాలయ్య, ఆయన కుమారుడు మోక్షజ్ఞ తెరకెక్కించాలని చూస్తున్నట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త షికారు చేస్తున్నది.
నందమూరి వారసుల కాంబినేషన్ సెట్ కావడం కష్టంగా మారిన నేపథ్యంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.
balakrishna junior ntr nagarjuna nagachaitanya dilraju బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున నాగ చైతన్య దిల్ రాజు


Click it and Unblock the Notifications