»   »  పెద్ద అల్లుడుపై బాలకృష్ణ సీరియస్?

పెద్ద అల్లుడుపై బాలకృష్ణ సీరియస్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ, వసుంధరాదేవి దంపతుల చిన్న కుమార్తె తేజస్విని వివాహం మతుకుమల్లి శ్రీపట్టాభి రామారావు, శ్రీమణి దంపతుల కుమారుడు శ్రీభరత్‌తో ఓ నాలుగు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, మాదాపూర్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభోగంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇటు సినీ, అటు రాజకీయ రంగాలకు చెందిన అనేకమంది హాజరై వధూవరులను ఆశీర్వదించారు.అయితే ఈ వివాహంలో ఆయన పెద్ద అల్లుడు నారా లోకేష్ బాబు వచ్చిన బంధు,మిత్రులను సాదరంగా ఆహ్వానించకుండా ...మాత్రం ఎప్పుడూ సెల్ లో బిజీగా ఉంటూ కనపడ్డాడని దాంతో ఆయన చాలా కోపం తెచ్చుకున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఆయనలో కోపం గమనించిన లోకేష్ ఇమ్మిడియట్ గా సెల్ ఆపి..వెళ్ళి పెళ్లిలో జాయిన్ అయినట్లు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ...కుటుంబం,పద్దతి,సంప్రదాయం వంటి విషయాల్లో చాలా పద్దతిగా స్ట్రిక్ గా ఉంటాడని, అదే పెళ్లిలో కనిపించిందని పెళ్లికి వెళ్లిన వారు బాలకృష్ణను మెచ్చుకుంటున్నారు.


బాలకృష్ణ అభిమానులూ ఇతోధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకకు మరింత కళ తీసుకువచ్చారు. సినిమా సెట్స్‌ను తలపించేరీతిలో సంప్రదాయబద్ధంగా వేసిన భారీ సెట్‌లో కన్నుల పండువగా జరిగిన ఈ వివాహానికి రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామికరంగ ప్రముఖులతో పాటు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సినీ ప్రముఖులు సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, అంబికా కృష్ణ, వెంకటేష్‌, మోహన్‌బాబు, జగపతిబాబు, మురళీమోహన్‌, రోజా, సి.కల్యాణ్‌, శ్రీకాంత్‌, బోయపాటి శ్రీను, నందమూరి కల్యాణ్‌రామ్‌, మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్‌, నారా రోహిత్‌, తరుణ్‌, శివాజీరాజా, ఉదయ్‌కిరణ్‌ తదితరులు హాజరయ్యారు.


ఇక బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. జయసింహా అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పెళ్లి పాటను రీసెంట్ గా చిత్రీకరించారు. అలాగే రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో హీరో మీద ఇంట్రడక్షన్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సోనాలి చౌహాన్ ని ఒక హీరోయిన్ గా ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది.

దర్శకుడు బోయపాటి శ్రీను సారథ్యంలో రాజకీయ ప్రాధాన్యం కలిగిన చిత్రంలో తాను నటిస్తున్నానని, ఎన్నికల నాటికి ఇది విడుదల చేస్తామని, నేటి రాజకీయాల్లో అవినీతి, అవకతవకలను ఈ చిత్రంలో చూపిస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని, పార్లమెంట్‌ ఎన్నికలు నవంబర్‌, డిసెంబర్‌లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది.

బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.

English summary

 Balakrishna's new film under the direction of Boyapati Srinu started its regular shoot at RFC. Balakrishna's films are bound to have powerful punch dialogues and his upcoming movie Jayasimha will also be having plenty of such stuff to reach out to the masses. Director Boyapati Seenu and writer Ratnam have once again come up with some good one-liners for this commercial flick. Sonal Chauhan is one of the heroine in the film. Music is scored by Devi Sri Prasad. This film touted to be Jayasimha is being jointly produced by 14 Reels (Dookudu fame) and Vaarahi (Eega fame).The duo is planning to recreate the magic of Simha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu