»   » నిజ జీవిత పాత్రను తెరపై పోషిస్తున్న బాలకృష్ణ

నిజ జీవిత పాత్రను తెరపై పోషిస్తున్న బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ త్వరలో తన నిజ జీవిత పాత్ర అయిన సినిమా హీరోగా ఆయన కనిపించనున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న పరమవీర చక్ర చిత్రంలో ఈ విశేషం చోటు చేసుకోనున్నది. ఈ చిత్రంలో సింహా మాదిరిగానే బాలకృష్ణ ఢ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ఆర్మీ మేజర్ పాత్ర కాగా, మరొకటి సినిమా హీరో పాత్ర. ఈ రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆయన కనువిందు చేయనున్నాడు. ఇప్పటికే రామోజీ ఫిలింసిటీలో ఒక షేడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తదుపరి షేడ్యూల్ ఈ నెల 16 నుంచి జరగనుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన అనుష్క, షీలా నాయికలుగా నటిస్తున్నారు. తేజ సినిమా పతాకంపై సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బొబ్బిలి పులి సీక్వెల్ గా చెప్పబడుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu