»   » దాసరి ప్లాన్-బాలయ్య మెగా స్టంట్ తెలంగాణాలో వర్కఅవుట్ అవుతుందా....

దాసరి ప్లాన్-బాలయ్య మెగా స్టంట్ తెలంగాణాలో వర్కఅవుట్ అవుతుందా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనవరిలో విడుదలయ్యే సినిమాలకి తెలంగాణ సెగ సోకుతుందనే అనుమానాలుండగా, దానిని తట్టుకునేందుకు అనుమానాలుండగా, దానిని తట్టుకునేందుకు 'పరమ వీర చక్ర" చిత్రానికి దాసరి మెగా స్కెచ్ వేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణతో కొమరం భీమ్ గెటప్ వేయించారు. ఆ గెటప్ తాలూకు స్టిల్స్ కూడా రిలీజ్ చేసేశారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్ర ప్రదర్శనకి ఎలాంటి అవాంతరాలు ఏర్సడవని ఆశిస్తున్నారు. నిజానికి ఈ చిత్రంలో కొమరం భీమ్ గా బాలయ్య చేసేదేమీ ఉండదు. కేవలం ఒక సన్నివేశంలో ఆ గెటప్ లో కనిపిస్తారంతే..

ఇందులో సినిమా హీరోగా ఒక పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకి అనుగుణంగా బాలకృష్ణ కొన్ని సన్నివేశాల్లో కొందరు అమరవీరుల గెటప్స్ లో కనిపిస్తారు. అందులో భాగంగా వచ్చే గెటప్ ఇది కూడా. అయినా కానీ తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకునేందుకు కొమరం భీమ్ గెటప్ కి విస్పృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో తెలంగాణలో 'పరమవీర చక్ర" కి కలెక్షన్స్ పంట పండుతుందని దాసరి ఆశిస్తున్నారు. చూద్దాం ఆయన ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో? కొమరం భీమ్ గెటప్ ఈ చిత్రానికి ఎంతటి పరమవీర విజయాన్నిఅందిస్తుందో?

English summary
Balakrishna now does the role of "Komaram Bheem". Komaram Bheem is a revolutionary freedom fighter from Telangana region. In the wake of Telangana movement, Komaram Bheem became a favourite for film personalities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu