»   » బాలకృష్ణ,బి.గోపాల్ కాంబినేషన్ కొత్త చిత్రం టైటిల్ ఏంటి?

బాలకృష్ణ,బి.గోపాల్ కాంబినేషన్ కొత్త చిత్రం టైటిల్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ, బి గోపాల్ దర్సకత్వంలో గతంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేయటానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నం చేస్తున్నారు. అందునిమిత్తం తాజాగా హర హర మహా దేవ శంభో అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీలతో శంభో శివ శంభో నిర్మించిన బెల్లంకొండ సిమిలర్ గా ఈ టైటిల్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం కథ నిమిత్తం బి.గోపాల్ గత కొంతకాలంగా స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నారు. అయితే కథ దాదాపు ఫైనలైజ్ అయ్యినట్లేనని, స్క్రిప్టు వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ఇక మస్కా ఫ్లాఫ్ తర్వాత బి.గోపాల్ మరో చిత్రాన్ని డైరక్ట్ చేయలేదు. అద్భుతమైన కథ, అత్యున్నత సాంకేతిక విలువలతో తమ కొత్త చిత్రం ఉంటుందనీ, బాలకృష్ణ ఇమేజ్ ను పెంచే విధంగా అత్యంత భారీ చిత్రంగా దీనిని రూపొందించనున్నామనీ ఈ నిర్మాత చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu