హాట్ టాపిక్ : బాలకృష్ణ, బోయపాటి చిత్రం లీకైన డైలాగ్

విలన్: నేను ఎవరో..నాది ఏ పార్టినో...నా రేంజేంటో తెలుసా?
బాలకృష్ణ : (నవ్వుతూ) నువ్వు పెట్టింది ఒక పార్టీ... ఉంటోంది మరో పార్టీలో..సీబిఐ పేరు చెబితే వణుకుతావు...అది నీ రేంజ్
(ఆడియన్స్ వైపు తిరిగి)
నేను ఏ పార్టీనో...నా రేంజి ఏంటో...అదిగో వాళ్ళను అడుగు...చరిత్ర స్పష్టించిన పార్టిరా నాది..రికార్డ్స్ బ్రేక్ చేసిన రక్తం రా నాది..
విలన్: రేయ్ నీ ప్రాణం తీస్తా...
బాలయ్య: రేయ్...(కోపంతో విలన్ మీదకు వంగి)...
నా కళ్లళ్లో ఏర్పడ్డ ఎర్ర జీరాల పొడవు చూడరా.. నీ ఆయుష్..ఏంటో తెలుస్తోంది..కంటికి కనిపించకుండా కంట్రీ వదిలి పోరా కంత్రి నా కొడకా
వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది.
ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.


Click it and Unblock the Notifications











