»   » బాలకృష్ణ 101 వ చిత్రం ఫైనల్: డైరక్టర్ ఎవరో తేలిస్తే ఆశ్చర్య.పోతారు

బాలకృష్ణ 101 వ చిత్రం ఫైనల్: డైరక్టర్ ఎవరో తేలిస్తే ఆశ్చర్య.పోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ 101 సినిమా డైరక్టర్ విషయంలో డైలమా వీడినట్లే కనపడుతోంది. బాలయ్య ఈ చిత్రం విషయమై ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుగు సినీ వర్గాల సమచారం. అయితే ఆ చిత్రాన్ని డైరక్ట్ చేసేందుకు బాలయ్య ఆయన్ను ఓకే చేస్తారని ఎవరూ ఊహించలేదు. అసలు ఆ డైరక్టర్ సీన్ లోకి వస్తారని అనుకోలేదు. ఇంతకీ ఎవరా డైరక్టర్..అసలేం జరిగింది ఆంటే..

దర్శకుడు క్రిష్ తో చేసిన ప్రతిష్టాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సక్సెస్ తరవాత నటసింహ నందమూరి బాలకృష్ణ తర్వాత చేసే చిత్రం ఇంతకన్నా అద్బుతంగా ఉండాలనే ఆలోచనలో పడిపోయారు. బడ్జెట్ ని కూడా పెంచి, ఈ చిత్రం తర్వాత క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీతో సినిమా చేద్దామని బాలయ్య అనుకున్నారు. రైతు అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టారు. అయితే రైతు కాన్సెప్ట్ తో చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ తీసెయ్యడంతో.. ఆ కథ ను కొంత కాలం పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు.

Balakrishna is planning to go with K S Ravikumar for his 101st movie.

దాంతో వరసగా నెల రోజులుగా సీనియర్, జూనియర్ డైరక్టర్లు బాలకృష్ణకు కథలు వినిపించారు. వాటిలో అన్నిటికంటే తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పిన స్టోరీ బాగుందని సమాచారం. కథ విన్నప్పుడే ఒకే చెప్పేద్దామని అనుకున్నారు. అయితే తమిళంలో ఒకప్పుడు అజిత్ తో తాను చేసిన సినిమానే బాలయ్యతో రీమేక్ చేస్తానని చెప్పాడం ఆయనకు రుచించలేదట. కానీ దర్శకుడుగా ఆయన సమర్ధత తెలిసున్నవాడు కావటంతో...బాలయ్య మాత్రం వేరే కథ తెమ్మని సూచించారట.

ఈలోగా తన తండ్రి, మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథను స్క్రిప్ట్ గా మార్చే పనిలో పడ్డారు. తండ్రి సినిమాకి పరిశోధనకు ఎక్కువగా టైమ్ పడుతుందని గ్రహించిన బాలయ్య కేఎస్ రవికుమార్ చెప్పిన కథతోనే రావాలని బాలకృష్ణ ఫిక్స్ అయ్యారు. తన 101 సినిమా డైరక్షన్ బాధ్యతలు ఆయనకే ఇవ్వనున్నట్లు సమాచారం.


ఇక ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని వినపడుతోంది. ఇంతకీ అంతగా మెప్పించిన కథ ఏమిటని ఆరా తీస్తే.. అది మాస్ మసాలతో నిండిన ఫ్యాక్షన్ స్టోరీ అని తెలిసింది. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఫార్ములాతోనే ఇప్పుడు వచ్చేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నారన్నమాట.

English summary
Balakrishna is planning to go with K S Ravikumar for his 101st movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu