»   » బాలకృష్ణ ఎక్కడనుంచి పోటీ?

బాలకృష్ణ ఎక్కడనుంచి పోటీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
హైదరాబాద్ : తండ్రి బాటలో ప్రయాణిస్తూ రాజకీయాల్లోకి వస్తున్న బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే కాక సినీ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ ఇంతవరకూ ఎక్కడా పోటీ చేయలేదు. కానీ, ఈసారి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నట్లు కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. లోక్‌సభకు పోటీ చేస్తారా లేక అసెంబ్లీకి పోటీ చేస్తారా... అసలు ఆయన మనసులో ఏం ఉంది.. అన్నదానిపై ఇంతవరకూ పార్టీ వర్గాల వద్ద ఆయన బయట పడలేదు. ఆయనను దృష్టిలో ఉంచుకొని టీడీపీ కొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.

ఇందులో అనంతపురం జిల్లాలోని హిందూపురం, కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆయన పోటీ చేస్తానంటే హిందూపురం లేదా విజయవాడ లోక్‌సభ సీట్లలో ఏదైనా ఇవ్వడానికి కూడా ఆ పార్టీ సిద్ధంగా ఉంది. వీటిలో అనంతపురం జిల్లాలోని సీట్లపైనే బాలయ్య చూపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆ జిల్లాకు చెందిన అభిమాన సంఘం నేతలు తనను కలిసినప్పుడు ఆయన హిందూపురం నియోజకవర్గం రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే... 14రీల్స్‌ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్‌'.ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం డైలాగులు, ప్రోమోలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలయ్య అభిమానులు పండగ చేసుకునే విధంగా రూపొందిందని చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని వినికిడి.

నిర్మాత మాట్లాడుతూ... ''శక్తివంతమైన నాయకుడికి ప్రతిరూపంగా బాలకృష్ణ ఇందులో కనిపిస్తారు. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని సునిశితంగా పరిశీలించి దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణను 'సింహా'గా చూపించిన బోయపాటి మరోసారి ఆ స్థాయిలో చూపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన వస్తోంది''అన్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


''బాలకృష్ణని ఓ కొత్త తరహాలో చూపిస్తున్నాం. ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారు. బాలకృష్ణ పలికే ప్రతి సంభాషణ.. అభిమానుల్ని అలరించేలా ఉంటుంది'' అని దర్శకుడు చెప్తున్నారు. బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.

English summary
Balakrishna has engaged himself into politics with Telugu Desam party and has been actively campaigning for the impending elections.Balakrishna is proposed to contest in the stronghold area of Hindupur Constituency.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu