»   » జూ ఎన్టీఆర్ పాటకి బాలయ్య డాన్స్

జూ ఎన్టీఆర్ పాటకి బాలయ్య డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ చిత్రంలోని పాటలకు బాలకృష్ణ అదిరిపోయేటట్లు డాన్స్ చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అది ఏ సినిమా కోసమో కాదట. అదుర్స్ సినిమా విజయోత్సాహాన్ని పురస్కరించుకుని టచ్ పబ్ లో ఏర్పాటు చేసిన పార్టీకి అటెండయిన బాలయ్య తన ఆనందాన్ని అలా వ్యక్తపరిచారట. దాంతో ఎన్టీఆర్ తన బాబయ్యని కౌగిలించుకుని సంతోషాన్ని తెలియపరిచాడు. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఈ పార్టీని ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి ఎన్టీఆర్ కు సన్నిహుతులైన సినీ ప్రముఖులు మరికొంత మంది హాజరయ్యి ఎంజాయ్ చేసారు.అదుర్స్ చిత్రం మొన్న సంక్రాంతికి రిలీజైంది. నయనతార,షీలా హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసారు. వివివినాయిక్ దర్శకత్వం వహించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu