»   » జూ.ఎన్టీఆర్ లాగే బాలకృష్ణ నుంచి డిమాండ్స్,ఒత్తిడి

జూ.ఎన్టీఆర్ లాగే బాలకృష్ణ నుంచి డిమాండ్స్,ఒత్తిడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయ వారసునిగా ప్రకటించాలన్న కోర్కెతో కొంత కాలం క్రితం బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ అంతర్గతంగా చంద్రబాబుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. దానిని పట్టించుకోలేదని అలిగి హరికృష్ణ పార్టీకి దూరంగా ఉండటం మొదలు పెట్టారు. ఆ వివాదంతో జూనియర్ కూడా పార్టీకి దూరంగా జరిగారు. ఇప్పుడు అదే కోణంలో బాలకృష్ణ నుంచి ఒత్తిడి మొదలైనట్లు కనిపిస్తోందని తెలుస్తోంది.

తనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. అది సాధ్యం కాని పక్షంలో సీమాంధ్ర రాష్ట్రానికి వేసే కమిటీకి తనను అధ్యక్షుడిగానైనా చేయాలని ఆయన పట్టుబడుతున్నారు. తన కోరికలను ఆయన ఇప్పటికే చంద్రబాబుకు విన్పించారు. అయితే, చంద్రబాబు ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. బాబు మౌనంపై బాలయ్య ఒకింత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

కొద్ది రోజుల క్రితం బాలయ్య అభిమాన సంఘం నేత ఒకరు విశాఖలో ఒక సమావేశం నిర్వహించి హడావుడి చేశారు. బాలయ్యకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు. ఏలూరులో కూడా మరో అభిమాన సంఘం నేత ఇదే రకమైన ఆరోపణలతో చిన్నపాటి ధర్నా నిర్వహించారు. మీడియాలో వీటికి విస్తృత ప్రచారం రావడంతో కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు మీడియా సమావేశంలో దీనిపై మాట్లాడారు.

 Balakrishna demands to announce the role of Balakrishna in TDP

అలాగే బాలకృష్ణ ఎక్కడ పోటీ చేయాలనుకొంటే అక్కడ టికెట్ ఇస్తామని ప్రకటించారు. కానీ ఈ ప్రకటన తర్వాత కూడా బాలకృష్ణ తనకు ఏ సీటు కావాలో చెప్పలేదు. పార్టీ అధ్యక్ష పదవి వ్యవహారం తేలిస్తేనే, తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది చెబుతానన్న ధోరణిలో బాలయ్య ఉన్నారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ డిమాండ్లపై తెలుగుదేశం పార్టీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

ఇక 14రీల్స్‌ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్‌'.ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం డైలాగులు, ప్రోమోలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలయ్య అభిమానులు పండగ చేసుకునే విధంగా రూపొందిందని చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని వినికిడి. ట్రేడ్ వర్గాల్లో చెప్పుకుంటున్న దాన్ని బట్టి ఈ చిత్రం దాదాపు 50 కోట్లు వరకూ బిజినెస్ జరుగింది. ఇది బాలయ్య కెరీర్ లో రికార్డే.

నైజాం రైట్స్ ని మల్టీ డైమన్షన్స్ వారు 7.5 కోట్లు ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నారు. అలాగే సీడెడ్ రైట్స్ ఏడు కోట్లుకి, గుంటూరు రైట్స్ 3.6 కోట్లుకు, నెల్లూరు రైట్స్ 1.6 కోట్లు వరకూ పలికాయని టాక్. ఓవరాల్ థియోటకల్ రైట్స్ 38- 40 వరకూ వెళ్లాయని అంటున్నారు. శాటిలైట్ రైట్స్ తొమ్మిది నుంచి పదికోట్లు వరకూ ఉన్నాయి. 35 కోట్లుతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు చేరుతుందని సమాచారం. దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మార్చి 28న విడుదలకు సిద్దం చేస్తున్నారు.

English summary
Balakrishna's fans want him to be made TDP President.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu