»   » ‘డిక్టేటర్ ’చిత్రం కథ ఇదేనా?

‘డిక్టేటర్ ’చిత్రం కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి కానుకగా బాలకృష్ణ హీరోగా రేపు విడుదల అవుతున్న చిత్రం ‘డిక్టేటర్ ' చిత్రం హాలీవుడ్ చిత్రం ‘The Equalizer' అనే హాలీవుడ్ చిత్రం మక్కి మక్కి కాపీ అనే టాక్ అంతటా వినపడుతోంది. అలాగే ఈ చిత్రం కథ అంటూ ఓ కథ పరిశ్రమలో ప్రచారంలో ఉంది. ఆ కథను మీకు అందిస్తున్నాం. నిజమా కాదా అనేది మీరు సినిమా చూసి తేల్చండి.

అందుతున్న సమచారం ప్రకారం బాలకృష్ణ పేరు చందు. హైదరాబాద్ లోని ఓ మార్ట్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తూంటాడు. చాలా సాదాసీదా జీవితం గడిపే అతని జీవితంలో ఊపించని సంఘటనతో ఓ మలుపు తిరుగుతుంది. హీరోయిన్ అవ్వాలని కోరికతో ఉన్న సోనాలి చౌహాన్ ఓ డబ్బు వ్యవహారంలో చిక్కుకుపోవటంతో విలన్ కు సంభందించిన వారు ఆమెను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వారి నుంచి తప్పించుకోవటానికి పరుగులు తీస్తూండగా...బాలకృష్ణ ఉన్న చోటకు వస్తుంది.


Balakrishna Dictator is The Equalizer Remake

అప్పుడు రౌడీల నుంచి వారిని బాలయ్య కాపాడతాడు. ఆమె ఇవ్వాల్సిన డబ్బు తాను ఇస్తానని బాలయ్య మాట ఇస్తాడు. అప్పుడు విలన్ అతనికి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. మరసటి రోజు సోనాల్ తో బాలయ్య ఫోన్ లో మాట్లాడుతూంటే... విలన్ మనుష్యులు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఫోన్ లో ఆ హడావిడి విని ..బాలయ్య..తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్ సాయింతో గ్యాంగ్ దగ్గరకు వెళ్తాడు.


ఆ టైమ్ లో అతనికి విలన్స్ ద్వారా రివీల్ అవుతుంది. గతంలో బాలయ్య..ఓ మాఫియా డాన్ డిక్టేటర్ ని తెలుస్తుంది. అక్కడ నుంచి బాలయ్య తిరిగి డిక్టేటర్ గా మారి ఎలా విజృంభించాడు. ఇంతకాలం బాలయ్య ఎందుకు అజ్ఞాతంలో బ్రతికాడు..ఫ్లాష్ బ్యాక్ ఏమిటి..అంజలి , అక్ష పాత్రలు ఏమిటి వంటివాటికి సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

English summary
‘Dictator’ is gossiped to be a free-make of American action neo-noir vigilante crime thriller movie ‘The Equalizer.’
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu