»   » ఏడుగురు మరదళ్ళతో బాలకృష్ణ సరసాలు

ఏడుగురు మరదళ్ళతో బాలకృష్ణ సరసాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలకృష్ణ ఏడుగురు మరదళ్లతో సరసాలు ఆడుతూ మనల్ని మురిపించనున్నాడని సమాచారం. బాలకృష్ణ,బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ సన్నివేశాలు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. ఏడుగురు అందాల రాశిలతో ఈ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో మనో రంజకంగా షూట్ చేస్తారని చెప్తున్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా,బావ,మరదళ్ల సరసాలతో ఈ పాట ని ప్రత్యేకంగా రాయించారని, ఈ పాట సినిమాలో హైలెట్ కానుందని ఫిల్మ్ నగర్ సమాచారం.

సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు.

'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు. అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు.

బాలకృష్ణగార్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. ఏ సినిమాకైనా టిక్కెట్ తెగేది హీరోని చూసే. 50, 60 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది హీరోని చూసే. అందుకే నా సినిమాల్లో హీరోని వేరే ఏ ఇతర పాత్రలూ డామినేట్ చేయనివ్వను. నా సినిమాల్లో నా హీరోనే హైలైట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి అభిమానిని అని భావిస్తా. అప్పుడే ఓ అభిమాని ఆ హీరో నుంచి ఏమేం ఎదురు చూస్తున్నాడో అవన్నీ చేయగలుగుతా.

English summary
Boyapati Sreenu, Balakrishna combo movie is rolling at brisk pace in RFC. Earlier in ‘Dhammu’ movie Boyapati Sreenu canned a song on NTR with four beauties now he has created seven sister-in-law’s (Maradallu) for Balakrishna in this movie. Buzz is that Boyapati Sreenu is planning a song on Balakrishna with seven beauties. Devi Sri Prasad is scoring music for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu