»   » పరమవీర చక్ర ప్లాప్ తో బాలయ్య బాబు ముఖంలో తేజస్సు తగ్గిందా..

పరమవీర చక్ర ప్లాప్ తో బాలయ్య బాబు ముఖంలో తేజస్సు తగ్గిందా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అన్నగారు ఎన్టీఆర్ తర్వాత నందమూరి వంశంలో బాలకృష్ణ అంతటి అందగాడు లేడనేది ఖచ్చితంగా చెబుతారు నందమూరి వంశ అభిమానులు. వాళ్శు చెప్పినా చెప్పక పోయినా ముమ్మాటికి అదే నిజం అంటున్నారు. నందమూరి వంశం నుండి వచ్చిన హీరోల్లో ముఖ తేజస్సు నిండుగా ఉండేది ఒక్క బాలయ్య బాబుకే అన్నది కూడా నిజమే. యాభైలలో బాలయ్య బాబు వయసు పడినా కూడా ముఖం నిండా ముడతలు రావడం సహాజమే అయినా కెమెరామెన్లు మాత్రం ప్రతి సినిమాకు బాలయ్యను అందంగా చూపించడం కోసం వాళ్శు చేసే ప్రయత్నం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.

ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బాలయ్య సింహా చిత్రంలో కాలేజీ ప్రోపెసర్ పాత్రలో కనపడ్డ తీరు, నందమూరి యువకిశోరాలు అయినటువంటి కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ లకన్నా కూడా కుర్రాడిలాగా ఉన్నడనేది నిజం. కానీ నిన్న విడదలైన పరమవీర చక్ర లో మాత్రం దాసరి ఇచ్చిన షాకులకు బాలయ్య బాబు ముఖం నిండా ముడతలతో స్పష్టంగా మసలోడి ఛాయలు కనిపించేసరికే నందమూరి వంశాభిమానులు ఒక్కసారిగా కుదేలయ్యారు. సినిమా ప్లాప్ అయినందుకు భాద లేదుగానీ, బాబుని ఛండాలంగా చూపించినటువంటి దాసరి కనపడితే మాత్రం కడిగేయడానికి రెడీగా ఉన్నారంట నందమూరి అభిమానులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu