For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వంద కోట్ల దర్శకుడితో బాలయ్య: పాన్ ఇండియాపై దండయాత్ర.. టాప్ ప్రొడ్యూసర్ భారీ ప్లాన్

  |

  బడా బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా చెలామణీ అవుతున్నారు నటిసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో తన మార్కును చూపిస్తూ దూసుకెళ్తోన్న ఆయన.. ఇప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న బాలయ్య.. ఇప్పటికే రెండు సినిమాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్‌తో సినిమాను చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  అఖండ హిట్‌తో ఫుల్ జోష్‌

  అఖండ హిట్‌తో ఫుల్ జోష్‌

  2021లో నందమూరి బాలకృష్ణ 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా భారీ అంచనాలతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రంతో కలెక్షన్ల పరంగానూ ఈ నందమూరి హీరో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి హవాను చూపించారు.

  శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!

  వీరసింహారెడ్డిగా అరాచకం

  వీరసింహారెడ్డిగా అరాచకం


  నటసింహా బాలకృష్ణ 'అఖండ' తర్వాత మరింత ఉత్సాహంతో దూసుకెళ్తోన్నారు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమా చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది.

  అనిల్ రావిపూడితో మూవీ

  అనిల్ రావిపూడితో మూవీ


  టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రాజెక్టును చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీనికి 'రామారావు గారు' అనే టైటిల్ పెట్టబోతున్నారు.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  అన్‌స్టాపబుల్ రికార్డులతో

  అన్‌స్టాపబుల్ రికార్డులతో


  సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న బాలకృష్ణ ఏ షోనూ హోస్ట్ చేయలేదు. కానీ, 'Unstoppable with NBK' షోకు మాత్రం ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేశారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరించారు. దీంతో మొదటి సీజన్‌లోని ఎపిసోడ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రెండో సీజన్ నడుపుతున్నారు.

  వందకోట్ల డైరెక్టర్‌తో మూవీ

  వందకోట్ల డైరెక్టర్‌తో మూవీ


  ఇప్పటికే చేతిలో రెండు సినిమాలను పెట్టుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మరింత సమాచారం లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య.. వందకోట్ల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో భారీ ప్రాజెక్టును చేయబోతున్నారట.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

   అల్లు అరవింద్ భారీ ప్లాన్

  అల్లు అరవింద్ భారీ ప్లాన్


  తమ బ్యానర్‌లో 'గీత గోవిందం' వంటి వంద కోట్ల రూపాయల సినిమాను తెరకెక్కించిన పరశురాంతో అల్లు అరవింద్ మరో క్రేజీ ప్రాజెక్టును చేయబోతున్నారు. అందులోనే బాలయ్య హీరోగా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ఫంక్షన్‌లో పరోక్షంగా వెల్లడించారు. ఇక, దీన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

  పాన్ ఇండియానే టార్గెట్

  పాన్ ఇండియానే టార్గెట్


  పరశురాం - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో అల్లు అరవింద్ నిర్మించబోయే సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతలా అన్ని వర్గాల వాళ్లకు చేరువయ్యేలా దీన్ని యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందించబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా చాలా వరకూ పూర్తైనట్లు తెలిసింది.

  English summary
  Nandamuri Balakrishna Doing Several Films At A Time. after these Projects.. He Will Do a Movie With Parasuram Direction Under Geetha Arts Banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X