»   » బాలకృష్ణ ని ఇంప్రెస్ చేసి, ఫుల్ లెంగ్త్ రోల్

బాలకృష్ణ ని ఇంప్రెస్ చేసి, ఫుల్ లెంగ్త్ రోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గమనిస్తే 2015 అంతా కమిడియన్ పృద్వి హవానే కనిపిస్తుంది. తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ తన డైలాగ్ లో కోత్తదనాన్ని రుచి చూపించిన ఈ నటుడు ఈ సంవత్సరంలో తనదైన శైలి కామెడీతో చాలా క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు.

సింహా సినిమాలోని బాలకృష్ణని స్పూఫ్ చేసిన సినిమా లౌఖ్యం, ఈ సినిమా పృద్వీకి బాగానే పేరు తెచ్చిపెట్టింది. ఇందులో కామెడీ బాగా పండటంతో బాలకృష్ణ కూడా బాగా ఇంప్రేస్ అయ్యరని తెలుస్తోంది. అందుకోసమే బాలయ్య తన ప్రస్తుత సినిమా డిక్టేటర్ లో చాలా లెంగ్త్ ఉన్నా పాత్ర ఇచ్చారని తెలుస్తోంది. ఇదీ కేవలం ప్రతిభకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. ట్రైలర్ లో కూడా మీరు అది గమనించవచ్చు.ఈమధ్య రీసెంట్ గా వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా హిట్ అవ్వడానికి కూడా ఇతని కామెడీ బాగా పనికోచ్చింది. ఇతను బ్రహ్మనందానికి ఆల్టర్ నెటివ్ గా అందరికి కనిపిస్తున్నాడు. ఇది కేవలం బ్రహ్మనందం కామెడీ అందించడంలో ఫేయిల్ అవ్వడంలో జరిగిన గమ్మత్తు.


ప్రస్తుతానికి తెలుగు సినిమాకు దోరికిన కామెడీ వజ్రం అని తెలుగు ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. ఇదే జోరుతో మరికొన్ని సినిమాలు చేసుకుంటు వెళుతున్నాడు ఈ ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.

English summary
Balakrishna too is reportedly impressed with Prudhvi's comedy.
Please Wait while comments are loading...