»   » అయ్యో..! పాపం..బాలయ్య 'పులి' కాదు 'సింహం'

అయ్యో..! పాపం..బాలయ్య 'పులి' కాదు 'సింహం'

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరమవీర చక్ర అభినందన సభైతే ఏర్సాటు చేసారు కానీ ఎవరెవరకి ఏమేం మాట్లాడాలో దాసరి కోచింగ్ ఇచ్చినట్లు అనిపించలేదు. అందుకే హాజరైన ఒక్కొక్కరు ఒక్కో విధంగా తల తిక్కగా మాట్లాడి సభికుల్ని కంగారు పెట్టేసారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారైతే బాలయ్య పరమవీర చక్రని ఏకంగా పులితో పోల్చేసారు. అయ్యో! పాపం..బాలయ్య పులి కాదు సింహం అని చెప్పే కనీస సినీ పరిజ్ఝానం లేనివారు ఉన్న ఈ సభలో ఆద్యంతం నవ్వుల తూటాలు పేలాయి.

'పులి" కడుపున పులే పుడుతుంది. అన్నయ్య ఎన్టీఆర్ కడుపున ఈ పులి పుట్టడమే కాదు పులి లాంటి ఈ సినిమాని తీసి తండ్రి పేరు నిలబెట్టాడు" అని రాజకుమారి అంటుంటే దాసరి ముఖంలో వెలిగిన వెయ్యి ఓల్టుల బల్బు ముందు అక్కడి డే లైట్లు కూడా వెలవెలబోయాయి. ప్రోగ్రాం మొత్తం చూసాక ఇంతకీ బాలయ్య పులినా, సింహంమా అంటూ కొందరు అభిమానులు బుర్రలు గోక్కోవటం గమనించ దగ్గ పరిణామం. అభినందన సభని కూడా మరో పరమవీర చక్ర ను చేసి పారేసిన దాసరి అభినందనీయుడే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu