»   » సినీ జనం బాలయ్య ను ఎందుకు హర్షిస్తున్నారంటే...!?

సినీ జనం బాలయ్య ను ఎందుకు హర్షిస్తున్నారంటే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా రోజుల తర్వాత లభించిన 'సింహా" ఘన విజయం బాలకృష్ణలో చాలా మార్సుని తీసుకొచ్చిందనే చెప్పాలి. దాసరి 150వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'పరమవీర చక్ర" స్ర్కిప్ట్ విషయంలోనూ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించిన బాలయ్య ఆ కథలో ఎలాంటి అతిశయోక్తులూ వుండకూడదని ఏమాత్రం మొహమాటం లేకుండా దాసరికే చెప్పేయడం విశేషం. అలాగే ఇటీవల పరుచూరి మురళి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కూడా తనకు పూర్తి సంతృప్తిని కలిగించే రీతిలో కథ మొత్తం సిద్దమయ్యాకే షూటింగ్ పెట్టుకుందామని అన్నారట.

ఆపై తన దగ్గరకు వచ్చిన 'ఆదిత్య 369" నిర్మాత శివలెంకృష్ణ ప్రసాద్ కి కూడా 'మాకిప్పుడు బేనర్, డైరెక్టర్ కంటే కథే ముఖ్యం. మీరు సరైన కథతో వస్తే వెంటనే సినిమా చేయడానికి నేను సిద్దం" అని చెప్పి పంపారట. మొత్తానికి తనకు సరిపడే కథలే కావాలని బాలయ్య కోరుతూ వుండడం, కథ బాగుంటేనే సినిమా చేస్తాననీ లేకుంటే ఖాళీగానైనా వుంటాననీ అంటూండడం చూసి 'భలే డెసిషన్ తీసుకున్నావయ్యా బాలయ్యా" అని సినీ జనం హర్షిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu