»   » 'పరమ వీర చక్ర' ఫ్లాప్ బాలకృష్ణకు పాఠాలు నేర్పిందా?

'పరమ వీర చక్ర' ఫ్లాప్ బాలకృష్ణకు పాఠాలు నేర్పిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరమవీర చక్ర పరాజయంతో బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని ఎలా గైనా హిట్ చేయాలని తలపోస్తున్నారు. అందుకోసం ఆయన రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కథ,గెటప్స్ విషయంలో ఆయన దగ్గరుండి మార్పులు చేయిస్తున్నారని తెలుస్తోంది. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేయనున్నారు. దాంతో ఆ మూడు గెటప్స్ వేటికవే స్పెషల్ గా ఉండాలని,రెగ్యులర్ గా పొరపాటున కూడా ఉండకూడదని ఆయన దర్శకుడుకి చెప్పినట్లు సమాచారం. పరమవీర చక్రలో చేసిన ద్విపాత్రాభినయం గెటప్స్ పెద్దగా ఆకట్టుకోలేదని అభిమానులు సైతం విమర్శిస్తూండగా ఆయన ఈ సారి ఆ పొరపాటు జరగకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే కధ,కథనం కూడా పకడ్బందీగా ఉండాలని, మళ్ళీ సింహా తరహా విజయం సాధించాలంటే స్క్రిప్టుపై కసరత్తులు చేయాల్సిందేనని పదే పదే చెప్తున్నారుట.

ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ నిర్మించారు. బాలకృష్ణ, బ్రహ్మానందం తదితరులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కొన్ని యాక్షన్‌ సీన్స్ ను కూడా అక్కడే తీయనున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ కనిపించే మూడు పాత్రల మధ్య సంబంధం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు‌. కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.3గా ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్‌, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌, ఆదిత్య మీనన్‌ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: సందీప్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu