»   » బాలకృష్ణ నెక్ట్స్ 14 రీల్స్ వాళ్ళే....

బాలకృష్ణ నెక్ట్స్ 14 రీల్స్ వాళ్ళే....

Posted By:
Subscribe to Filmibeat Telugu
BalaKrishna
హైదరాబాద్ : బాలకృష్ణ మరోసారి 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ కి సినిమా చెయ్యబోతున్నారని సమాచారం. ప్రస్తుతం 'లెజెండ్‌' చిత్రం నిర్మిస్తున్న 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ మరోసారి బాలకృష్ణ తో ఎగ్రిమెంట్ అయ్యారని చెప్తున్నారు. బాలకృష్ణకు సైతం వారి నిర్మాణ విలువలు, నిజాయితితో వ్యవహరించే తీరు నచ్చి మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు టాక్స్ జరిగాయని,స్క్రిప్టు వర్క్ కూడా ప్రారంభమయ్యిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

రవికుమార్ దర్శకత్వంలో చేయటానికి బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ ని తెరపై విజిల్స్ వేయించేలా తీయటంలో ఆయనకి ఆయనే సాటి. ఇక రీసెంట్ గా బాలకృష్ణకు స్టోరీ లైన్ చెప్పటం జరిగిందని తెలుస్తోంది. బాలకృష్ణ పూర్తి స్క్రిప్టు విని,డేట్స్ కేటాయిస్తానని చెప్పాడని అంటున్నారు. నిర్మాత ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. బెల్లంకొండ సురేష్ అయ్యే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే గతంలో రవికుమార్ తెలుగులో ఓ చిత్రం చేసారు. అదే నాగార్జునతో బావ నచ్చాడు. అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఇక బాలకృష్ణని 'సింహా'గా చూపించారు బోయపాటి శ్రీను. అప్పటి వరకు పెద్ద పెద్ద సంభాషణలతో తనదైన శైలిలో కనిపించిన బాలకృష్ణని కొత్తగా చూపించి అభిమానులతో శభాష్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి బాలకృష్ణని నాయకుడు తరహా పాత్రలో చూపించబోతున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ నటిస్తున్నారు. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సామాజిక అంశాల నేపథ్యంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రస్తుత రాజకీయాలపై విమర్శలు కూడా ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే 'లెజెండ్‌' పేరు పరిశీలనలో ఉంది.

'సింహ' కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. జగపతిబాబు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ తొలిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్‌ లెజెండ్‌ ఫస్ట్‌లుక్‌ను రీసెంట్ గా విడుదల చేసింది. దానికి మంచి క్రేజ్ వచ్చింది.

English summary
BalaKrishna is going to team up with Tamil director KS Ravi Kumar of Dashavataaram fame. This movie is said to be produced by 14 reels entertainment banner. Meanwhile Bala Krishna is busy with his upcoming film ‘Legend’ which is getting ready to hit the screens soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu