»   » బాలయ్య తర్వాతి సినిమా విషయంలో నిర్ణయం మారిందా?

బాలయ్య తర్వాతి సినిమా విషయంలో నిర్ణయం మారిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి భారీ విజయం సాధించడంతో అభిమానులంతా ఆయన తర్వాతి సినిమా ఏది అనే విషయమై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య 101వ సినిమా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'రైతు' అని కొంతకాలంగా ప్రచారం జరిగింది.

'రైతు' చిత్రంలో అమితాబ్ ను కూడా తీసుకోవాలని ప్లాన్ చేసారు. అయితే అమితాబ్ డేట్స్ దొరకక పోవడంతో ప్రస్తుతానికి 'రైతు' ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అమితాబ్ లేకుండా ఆ సినిమా కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.

Balakrishna

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... బాలయ్య నెక్ట్స్ మూవీ ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో కెఎస్ రవికుమార్ బాలయ్యను కలిసారని, బాలయ్యకు కూడా ఆయన చెప్పిన కథ బాగా నచ్చిందని టాక్.

అయితే ఇంకా ప్రాజెక్టు ఫైనల్ కాలేదు.... బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా స్క్రిప్టులో కొన్ని మార్పలు కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఏ విషయం అనేది తేలనుంది.

కెఎస్ రవికుమార్ సౌత్ లో టాప్ దర్శకుల్లో దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఆయన గతంలో చిరంజీవితో 'స్నేహం కోసం', నాగార్జునతో 'బావ నచ్చాడు' లాంటి సినిమాలు తీసారు. తమిళంలో ఇటీవల కాలంలో రజనీకాంత్ తో 'లింగా' చిత్రాన్ని తెరకెక్కించారు.

English summary
According to a source, Tamil-Telugu director K.S. Ravi Kumar, who made films with Chiranjeevi, Rajanikanth and Kamal Haasan, has approached Balakrishna with an interesting subject.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu