»   » 'బాలకృష్ణ 99 వ చిత్రం' లాంచింగ్ కు రంగం సిద్దం...డిటేల్స్

'బాలకృష్ణ 99 వ చిత్రం' లాంచింగ్ కు రంగం సిద్దం...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా... ‘లయన్' గా పలకిరించిన బాలయ్య తన 99వ చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తన 99వ సినిమాను ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసారు. శ్రీవాస్ దర్శకత్వంలో ఈనెల 29న బాలయ్య 99వ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రాన్ని ఘనంగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఇంకా ఖరారు కానీ ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్, వారాహి చలనచిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పటికే...ఈ సినిమాకు స్ర్కిప్టు పూర్తయింది. దీనికోసం ఏకంగా ఐదుగురు రచయితలు కసరత్తులు చేస్తున్నారని సమాచారం. తెలుగులో టాప్ రైటర్స్ గా వెలుగుతున్న గోపి మోహన్, కోనవెంకట్, బీవీఎస్.రవి. డైమండ్ రత్నం, శ్రీధర్ సీపానలు ఈ చిత్రానికి రచయితలుగా పని చేస్తున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ‘డిక్టేటర్' అనే పేరును పరిశీలిస్తున్నారు. మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందింస్తున్నారు. 

Balakrishna’s 99th flick launched in Ramanaidu studios.

'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన శ్రీవాస్... బాలకృష్ణ లాంటి స్టార్ మాస్ హీరోను డీల్ చేయడం ఇదే మొదటిసారి. అందుకునే పకడ్బందీగా స్ర్కిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నాడట. కథ, స్ర్కీన్ ప్లే, మాటలు అంతా అద్బుతంగా సెట్ అయ్యాయనే నమ్మకం కలిగిన తర్వాతే జూన్ లో సెట్స్ పైకి సినిమాను తీసుకెళ్ళబోతున్నారట దర్శక నిర్మాతలు.

అయితే రీసెంట్ గా ...బాలకృష్ణ మాట్లాడుతూ...'ఇంకా కథ పూర్తిగా వినలేదు. ఆ పేరుని కూడా ఖరారు చేయలేదు. లైన్‌ మాత్రమే విన్నా. కథలో కొన్ని మార్పుల కోసం ప్రయత్నిస్తున్నాం. కుదిరితేనే చేస్తా, లేదంటే మరో కథని ఎంచుకొంటా' అంటూ కూల్ గా బాలకృష్ణ ట్విస్ట్ ఇచ్చారు. 'డిక్టేటర్‌' కథ ఎలా ఉండబోతోంది? అని మీడియావారు అడిగితే ఇలా సమాధానం చెప్పారు.

English summary
Balakrishna’s 99th flick will be directed by Lakshyam fame Sreewas. Titled Dictator, the pre-production works are going on in full swing and the film will be launched on May 29th in Ramanaidu studios.
Please Wait while comments are loading...