వివాదంలో బాలకృష్ణ 'లయన్' టైటిల్

By Pratap

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ్ణ నటిస్తున్న 98వ చిత్రం టైటిల్‌ విషయంలో వివాదంలో పడింది. సత్యదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ లయన్‌ ' అనే పేరును ఏపీ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. అయితే ఈ టైటిల్‌తో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఎప్పుడో రిజిస్టర్ చేయించానంటూ ఓ నిర్మాత వాదిస్తున్నారు.

ప్రస్తుతం ఈ టైటిల్‌ వివాదం ఫిలింనగర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుని డిసెంబర్‌ 31న టీజర్‌ విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Balakrishna's Loin in controversy

ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే రొమాన్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, ఆలీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పారిశ్రామికవేత్త రమణారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ పరిశీలించిన చిత్ర యూనిట్ గతంలో గాడ్సే వారియర్ అనుకున్నారు.

కానీ ఆ టైటిల్స్ బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా లేక పోవడంతో ‘లయన్ ' పేరు ఓకే చేశారు. టైటిల్ లో సింహం కలిస్తే బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ తో ఈ టైటిల్ నే ఖరారు చేస్తారని సమాచారం. సంక్రాంతి కి విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X