Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బాలయ్య సినిమా ఆగిపోవడానికి... ఏపీలో వైఎస్ జగన్ గెలుపుకు లింకు?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జైసింహా చిత్రాన్ని నిర్మించిన సి కల్యాణ్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎన్నికల తర్వాత షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా... ఉన్నట్టుండి ఆగిపోయినట్లు సమాచారం. అందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతుండటమే అనే రూమర్ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ బాలయ్య సినిమాకు... జగన్ సీఎం అవ్వడానికి కారణం ఏమిటి? సినిమాను ఎవరు ఆపారు? ఏపీ రాజకీయాలకు, బాలయ్య చేస్తున్న ఈ చిత్రానికి లింక్ ఏమిటనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

సినిమాలో విలన్ క్యారెక్టర్లు వారిని ఉద్దేశించా?
ఈ చిత్రంలోని విలన్ క్యారెక్టర్లు రియల్ లైఫ్‌లో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్‌ను పోలి అసాధారణంగా ఉంటాయని టాక్. విలన్ పాత్రలో జగపతి బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఏపీలో తాజా ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో దర్శక నిర్మాతలు స్రిప్టు మార్చాలనే నిర్ణయం తీసుకున్నారట.

స్క్రిప్టులో మార్పులు?
సినిమా స్క్రిప్టులో మార్పులు చేయడానికి చాలా సమయం తీసుకోనున్న నేపథ్యంలో త్వరలో ప్రారంభం కాబోతున్న షూటింగ్ పిలిపివేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై చిత్ర బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు.

మూవీ స్టోరీలో కీలక మార్పులు?
సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారని... ఈ మార్పులతో కథ పూర్తిగా మారిపోయే అవకాశం ఉండటంతో... అలా జరుగకుండా విలన్ పాత్రలు మరో రకంగా డిజైన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత? అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

రంగంలోకి బోయపాటి
కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేసే ఈ సినిమా ఆలస్యం అయితే రంగంలోకి బోయపాటి దిగుతారని టాక్. బాలయ్యతో సినిమా చేయడానికి ఈ మాస్ డైరెక్టర్ వెయిట్ చేస్తన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.