For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'లౌక్యం' టీమ్ తో చేయటం నిజమేనట

  By Srikanya
  |

  హైదరాబాద్ : వరస ఫ్లాఫుల్లో ఉన్న గోపిచంద్ తో 'లౌక్యం' అంటూ హిట్ కొట్టిన టీమ్ కి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడదే టీమ్ తో బాలకృష్ణ చిత్రం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ కామెడీ చేయటమేంటి..అని అంతా అనుకున్నారు కానీ అది నిజమే అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి లౌక్యం కు పనిచేసిన శ్రీధర్ పీసన డైలాగులు, కథ,స్క్రీన్ ప్లే గోపీ మోహన్, కోన వెంకట్, దర్శకత్వం శ్రీవాసు చేస్తున్నారు. ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. నిర్మాత ఇంకా ఖరారు కాలేదు. కానీ త్వరలోనే అన్ని విషయాలతో ప్రకటన రానుందని తెలుస్తోంది.

  రీసెంట్ గా బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

  మరో ప్రక్క అందరూ రామ్ చరణ్ తో శ్రీవాస్ ముందుకు వెళ్తారని భావించారు. అయితే ఈ లోగా బాలకృష్ణ ఈ ఆఫర్ ఇవ్వటంతో ఇటు జంప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం విజయాలతో మినిమం గ్యారెంటీ దర్శకుడుగా అతను టాలీవుడ్ లో సెటిల్ అయినట్లే. బాలకృష్ణతో కూడా అదే మాదిరిగా హిట్ కొడితే అతనికి తిరుగు ఉండదని సినీ వర్గాలు అంటున్నాయి.

  Balakrishna's next with 'Loukyam' Team

  బాలకృష్ణ ప్రస్తుత చిత్రం విషయానికి వస్తే...

  'లెజెండ్'తో విజయోత్సాహంలో ఉన్న బాలకృష్ణ... తన తర్వాతి చిత్రం అంటే 98వ చిత్రం షూటింగ్ లో కంటిన్యూగా పాల్గొంటున్నారు. ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ అనే నూతన దర్శకుణ్ణి పరిశ్రమకు పరిచయం చేయనున్నారాయన. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రపాటి రమణరావు నిర్మాత. లయిన్ అనే టైటిల్ ని పరిశీలుస్తున్నారు.

  నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.

  'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం.

  గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారని చెప్తున్నారు.

  బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.

  English summary
  'Loukyam' same team will now be working for Balayya. Gopi Mohan & Kona venkat are writing Story & Screen Play for the film and Dialogues are by Sridhar seepana and team. Sriwas will direct this Commercial Entertainer which will go to floors soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X