»   » బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఆ నవల ఆధారంగానే, ఆ నవల్లో ఏముంది?

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఆ నవల ఆధారంగానే, ఆ నవల్లో ఏముంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రిష్ రూపంలో బాలకృష్ణకు మంచి దర్శకుడు దొరికారు. తన కుమారుడుని లాంచ్ చేయటానికి క్రిష్ ని మించిన దర్శకుడు లేరని ఆయన భావిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఘనవిజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, తన వారసుడి ఎంట్రీకి కూడా అదే తరహా కథ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట.

అందుకే చారిత్రక కథాంశంతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అద్భుత విజయాన్ని అందించిన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చారిత్రక చిత్రంతో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అయ్యే అవకాశం ఉంది.

Balakrishna's Son Nandamuri Mokshagna's Debut Movie Confirmed

గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత వెంకటేష్ హీరోగా థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నాడు క్రిష్. ఆ సినిమా తరువాత మరోసారి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా చేసేందుకు అంగకీరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత గౌతమిపుత్ర శాతకర్ణికి సీక్వల్ గా శాతకర్ణి కుమారుడు వాశిష్టిపుత్ర పులుమావి కథతో మరో భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడు.ఈ సినిమాతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే తొలి భాగంలో పూర్తిగా యుద్ధం, సామ్రాజ్య స్థాపననే చూపించిన క్రిష్.. రెండో భాగాన్ని ప్రేమకథగా రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ రాసిన శ్రావణి అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు.

గౌతమిపుత్ర శాతకర్ణి తనయుడు వాశిష్టిపుత్ర పులోమావి, శ్రావణి ప్రేమకథే శ్రావణి నవల. ఇప్పుడు అదే కథను క్రిష్ భారీగా వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ క్లాసిక్ మొగల్ ఈ అజం తరహాలో చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

English summary
It seems that the stage is all set for yet another star to make his place in the industry as rumours are rife that Balakrishna's Son Nandamuri Mokshagna has locked the script for his debut film. If reports are to be believed, Balakrishna has decided son’s debut flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu