twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Balakrishna : నారూటే సపరేటు.. జగన్ తో భేటీ కోసం యత్నం.. పెద్దల భేటీ డౌటే?

    |

    టాలీవుడ్ నుంచి కొంతమంది సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ కాబోతున్నారు అనే వార్త గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గాని టాలీవుడ్ పెద్దలు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అయితే తాజాగా ఈ ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రచారం అయితే గట్టిగా మొదలైంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    అలా మొదలయింది

    అలా మొదలయింది

    టాలీవుడ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఒకటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల రేట్లు వ్యవహారం. నిజానికి వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు ప్రకటించి భారీ ఎత్తున టికెట్ల ధరలు పెంచి అమ్ముతున్నారు అనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టికెట్లు ఈ విషయంలో రంగంలోకి దిగింది. నిజానికి ముందు నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ విషయంలో నిర్ణయం తీసుకుందని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఈ విషయం మీద నేరుగా ఎవరూ స్పందించకపోయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం రాజకీయ కక్షలో భాగంగానే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

    అసలు ఏమైందంటే

    అసలు ఏమైందంటే

    అయితే ఇటీవల మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఇప్పటిది కాదని ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు ఏవీ సక్రమంగా రావడం లేదని గత ఏడాది వందల కోట్లు కలెక్షన్లు సాధించామని టాలీవుడ్ చెప్పుకుంటున్నా సరే కేవలం 39 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమా పెద్దలు కొందరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా టికెట్ల అమ్మకం గురించి కొన్ని సూచనలు చేయడంతో ఆ మేరకు ఒక పోర్టల్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.

    జగన్ తో చిరంజీవి భేటీ

    జగన్ తో చిరంజీవి భేటీ

    అయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి ఆధ్వర్యంలో ఒక బృందం భేటీ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఒక్కరే వెళ్లకుండా ఈసారి కుర్ర హీరోలు అయిన రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారిని కూడా ఆహ్వానించారని నిర్మాతల నుంచి సురేష్ బాబు, దిల్ రాజు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే ఇది ప్రచారమే కాగా ఒకపక్క ప్రభుత్వం నుంచి గానీ మరో పక్క సినిమా ఇండస్ట్రీ నుంచి గాని దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

    అంతా ఒట్టిదేనా

    అంతా ఒట్టిదేనా

    అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వైఎస్ జగన్ తో చిరంజీవి భేటీ అనే విషయం మీద తమకు ఎలాంటి సమాచారం లేదు అని కేవలం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల తో మంత్రి పేర్ని నాని 20వ తేదీన సమావేశం కాబోతున్నారని తమకున్న సమాచారం అని అంటున్నారు. అయితే చిరంజీవి కోసం అసలు అపాయింట్మెంట్ అడిగారా ? లేక ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారమేనా అనే విషయం మీద కూడా ఇలాంటి క్లారిటీ లేదు. చిరంజీవి లాంటి బడా హీరో వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడతారు అనుకుంటారు కానీ ఆయన పేర్నినాని తో భేటీ అవుతారా అంటే అనుమానమే.

    జగన్మోహన్ రెడ్డితో బాలయ్య

    జగన్మోహన్ రెడ్డితో బాలయ్య

    అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు ఈ విషయంలో ఎలాంటి చర్చ తావులేదని తన లాగే మిగతా హీరోలను ప్రభుత్వ అధినేతలతో మాట్లాడేటప్పుడు ఏ మాత్రం సంప్రదించడం లేదని గతంలో మెగాస్టార్ మీద ఆరోపణలు చేసిన బాలకృష్ణ ఈ సారి స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ కు వీరాభిమాని అనే ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది. బాలకృష్ణ కూడా ఒకసారి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు కూడా.

    Recommended Video

    Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
    ఆషామాషీ వ్యవహారం కాదు

    ఆషామాషీ వ్యవహారం కాదు

    అయితే ఇప్పుడు బాలకృష్ణ వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎలా నష్టపోతుంది? దానికి ఏం చేస్తే నష్టం జరగకుండా ఉంటుంది అనే విషయాల మీద చర్చలు జరపాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే నిర్మాతల తరపు నుంచి కాకుండా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల తరపు నుంచి బాలయ్య చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఎగ్జిబిటర్లు నుంచి ఇద్దరు వ్యక్తులను డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఇద్దరు వ్యక్తులను బాలకృష్ణతో పాటు జగన్ వద్దకు తీసుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మరి ఇది కేవలం ప్రచారం వరకే పరిమితం అవుతుందా? లేక నిజంగానే జరుగుతుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు మాత్రం ఆగాల్సి ఉంటుంది.

    English summary
    There are reports that Nandamuri Balakrishna himself is trying to get the appointment of the Chief Minister ys jagan on theatre tickets issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X