»   » బెల్లంకొండ పై బాలయ్య వెరీ సీరీయస్.. సంజాయిషీ!?

బెల్లంకొండ పై బాలయ్య వెరీ సీరీయస్.. సంజాయిషీ!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన హర హర మహాదేవ సినిమా ప్రారంభోత్సవంలో బాలయ్య పోస్టర్ లను చూసి అభిమానులు ఖంగు తిన్న సంగతి తెలిసిందే. కొన్ని పోస్టర్లు చూస్తే దశావతారం లో కమల హసన్ వేసిన గెటప్ లకు బాలకృష్ణ ముఖం మార్పింగ్ చేసినట్లు ఉంది.దాంతో కొందరు బాలకృష్ణకు దగ్గరైన అభిమానులు ఆయనకు ఈ విషయంపై కంప్లైంట్ చేసార్ట.దాంతో సినిమా ఓపెనింగ్ రోజే పాత పోస్టర్స్ పెట్టారెంటని బాలయ్య వెంటనే బెల్లంకొండని పిలిచి క్లాస్ పీకాట్ట.

దాంతో ఇలా ఇంకెప్పుడూ జరగదని అర్జెంటుగా ఏర్పాట్లు చేయాల్సి రావటంతో ఇలా జరిగిందని సంజాయిషీ ఇచ్చుకున్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఇక గతంలో బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్ లో గతంలో లక్ష్మీ నరసింహ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. అయితే కాల్పులు కేసు అనంతరం ఇద్దరు మధ్యా దూరం పెరుగుతూ వచ్చింది. అయితే బాలకృష్ణతో బెల్లంకొండ ప్రారంబించిన భీష్మ సమయంలో జరిగిన పరిణామాలుతో ఇద్దరూ మళ్ళీ దగ్గరయ్యారు.

English summary
Balakrishna new film Hara Hara Mahadeva with producer Bellamkonda was launched recently on the birthday of NBK. Balakrishna who attended that launch function was shocked to see the posters of him in Hara Hara Mahadeva pose. He completed the show without any disturbance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu