»   »  లెక్కల సంగతేంటీ.. క్రిష్‌పై బాలయ్య అసహనం

లెక్కల సంగతేంటీ.. క్రిష్‌పై బాలయ్య అసహనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీ నంబర్ 150 చిత్రం తొలివారంలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిందటూ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఢంకా భజాయించేశారు. ఈ వ్యవహరం గౌతమి పుత్ర శాతకర్ణి హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ల మధ్య వివాదంగా మారినట్టు ఫిలింనగర్ టాక్. అల్లు అరవింద్ ప్రకటించినట్టుగానే శాతకర్ణి కలెక్షన్లను ఎందుకు ప్రకటించలేదని క్రిష్ ను బాలయ్య నిలదీసినట్టు ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. శాతకర్ణి కలెక్షన్లను వెల్లడించకపోవడంపై బాలయ్య తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం.

 Balakrishna

దీంతో ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాల మధ్య పోటీ రిలీజ్ తర్వాత సద్దుమణగడం లేదనే విషయం స్పష్టమవుతున్నది. సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలు నువ్వా నేనా అన్నట్టుగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి రీఎంట్రీ మూవీగా విడుదలైన ఖైదీ నంబర్ 150కి అభిమానులు, ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నది. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా విమర్శల ప్రశంసలందుకొని కలెక్షన్లను కొల్లగొట్టింది. కాగా శాతకర్ణి పంపిణీదారులు, చిత్ర నిర్మాతల కార్యాలయాలపై మంగళవారం ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

English summary
Nandamoori balakrishn dissatifaction over krish's behaviour. He questions about collections.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu