»   » ముచ్చటగా ముగ్గురితో...బాలకృష్ణ !

ముచ్చటగా ముగ్గురితో...బాలకృష్ణ !

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా"లో ఇద్దరు ముద్దుగుమ్మలు, ఒక బొద్దుగుమ్మ హీరోయిన్లుగా నటిస్తుండడం తెలిసిందే. ఈ ముగ్గురు క్రేజీ హీరోయిన్లూ బాలకృష్ణతో తొలిసారి జత కడుతుండడంతో ఈ కాంబినేషన్‌కు మరింత క్రేజ్‌ తెచ్చిపెడుతున్నది. బాలకృష్ణ కూడా ఒక కొత్త గెటప్ లో అలరించనున్నాడని సమాచారం. బాలయ్యను ముందు ఎప్పుడూ ఇంతటి పెర్ఫామెన్స్ తో చూడలేదు. ఈ చిత్రంలో వేశ, భాష, నటన అంత అద్బుతంగా చేశారు. ఇక సింహా టైటిల్ కి కూడా చాలా పెద్దగా ప్రెక్షకుల దగ్గర నుండి రెస్పాన్స్ రావడం విశేషం అందుకే అదే టైటిల్ అని డిసైడ్ అయిపోయాం అని డైరెక్టర్ తెలియచేశారు.

'భద్ర"తో దర్శకుడిగా అరం గేట్రం చేసి, 'తులసి"తో తన కెరీర్‌కు ద్వితీయ విఘ్నం అనే గండం ఏర్పడకుండా.. ద్వితీయ చిత్రంతోనూ అద్వితీయ విజయాన్ని స్వంతం చేసుకుని.. తన కెరీర్‌లో ఫస్ట్‌ బెస్ట్‌ హ్యాట్రిక్‌ను నమోదు చేయాలని తహతహలాడుతున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై యువ నిర్మాత పరుచూరి కిరీటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చక్రి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకోవడం తెలిసిందే. మగువల మనసులు దోచుకోవడంలోనే కాదు.. వారి మనసులనెరిగి మసలుకోవడంలోనూ మన తెలుగు కథానాయకు లెప్పుడూ ముందుంటారు. ఈనేపథ్యంలో తనతో జత కడుతున్న ముగ్గురు ముద్దుగుమ్మలు నయనతార, స్నేహ ఉల్లాల్‌, నమితలతో బాలకృష్ణ ఎలా నెట్టుకొచ్చారన్నది తెలుసుకోవాలంటె మరి కొద్ది రోజులు ఆగక తప్పదు!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu