»   »  మాంసాహారం మానేసిన బాలకృష్ణ

మాంసాహారం మానేసిన బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
పౌరాణిక పాత్రలు పోషించేటప్పుడు నందమూరి తారక రామారావు మాంసాహారం మానేసేవారని సినిమా పరిశ్రమకు చెందిన వృద్ధులందరికీ తెలుసు. ఇప్పుడు బాలకృష్ణ అదే బాటలో పయనిస్తున్నారు. ఇప్పుడాయన కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో "పాండురంగడు" అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ కృష్ణుడిగా, పుండరీకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నా మటన్, చికెన్, చేపల కూరలతో యూనిట్ సభ్యులకు భోజనం పెట్టడం దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ఆనవాయితీ. కానీ స్వయంగా హీరో బాలకృష్ణ నాన్ వెజ్ ముట్టుకోకపోవడంతో "పాండు రంగడు" టీం మొత్తం వెజిటేరియన్ వంటకాలతో సరిపెట్టుకోవలసి వస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X